కరువు ప్రాంతంగా పిలిచే రాయలసీమలో రైతులు అద్భుతాలు చేస్తున్నారు. సంప్రదాయ పంటల్ని సాగుచేస్తూనే అధిక లాభాలు అందుకుంటున్నారు. వ్యవసాయ పద్ధతుల్లో చిన్న, చిన్న మార్పులు చేసి సేంద్రీయ ఎరువులతో అరటి, దానిమ్మ, బత్తాయి (చీనీ), మామిడి సాగు చేస్తూ అధిక దిగుబడిని అందుకుంటున్నారు.
ఇటీవల అనంతపురం జిల్లాలో ఆపిల్ సాగు చేసిన రైతు సక్సెస్ అందుకుంటే.. తాజాగా కడప జిల్లాకు చెందిన రైతు సేంద్రీయ ఎరువులతో పాటుగా బిందు సేద్యంతో బత్తాయి సాగు చేసి అధిక దిగుబడితో భారీగా లాభాలు ఆర్జించారు. కడప జిల్లా బి చెర్లోపల్లెకు చెందిన రైతు పేరం రామాంజులురెడ్డి 11 ఎకరాల్లో బత్తాయి సాగు చేశారు.
రామాంజులు రెడ్డి మొదటి నుంచి ఉద్యానవనశాఖ అధికారుల సలహాలు పాటిస్తూ తన తోటకు బిందు సేద్యం (డ్రిప్) ఏర్పాటు చేసుకున్నారు. అందరు రైతుల్లా కాకుండా రసాయన ఎరువుల్ని వాడకుండా పేడ ఎరువు, ఆముదం, వేపచెక్క వంటి సేంద్రీయ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించారు.
బిందు సేద్యంతో పాటుగా సేంద్రీయ ఎరువులు ఉపయోగించడంతో చెట్లు బాగా పెరిగాయి.. చీడపీడల బెడద కూడా లేదు. మిగిలిన రైతులకు ఎకరానికి 8 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుంటే.. రామాంజులు రెడ్డికి మాత్రం ఎకరాకు 14 నుంచి 16 టన్నుల దిగుబడి వచ్చింది.
11 ఎకరాల్లో 180 టన్నుల దిగుబడి సాధించారు. బిందు సేద్యంతో పాటుగా సేంద్రీయ ఎరువుల కారణంగా కాయలు కూడా నాణ్యంగా వచ్చాయి. రామాంజులు రెడ్డి తోటలో కాయలు నాణ్యంగా ఉండటంతో వ్యాపారుల నుంచి మంచి ధర వచ్చింది. ఏకంగా టన్ను రూ.98వేల నుంచి రూ.1.05 లక్షల వరకు కొనుగోలు చేశారు.
మిగిలిన రైతులు మాత్రం టన్ను రూ.70వేల నుంచి రూ.80వేల వరకు మాత్రమే విక్రయించారు. 11 ఎకరాల్లో పెట్టుబడి, మిగిలినవాటికి రూ.25 లక్షల వరకు ఖర్చు చేశారు. పెట్టుబడి పోను ఆయనకు ఆదాయం దాదాపు రూ.కోటికిపైగా వచ్చినట్లు రైతు రామాంజులు రెడ్డి చెబుతున్నారు.
సలహాలను పాటించి సేంద్రీయ ఎరువులు, బిందు సేద్యంతో ఈ రైతు అద్భుతం చేశారు.. అధిక లాభాలు అందుకున్నారు. రాయలసీమ ప్రాంతంలో వర్షపాతం తక్కువగానే ఉంటుంది. అందుకే అక్కడి రైతులు మెట్ట పంటల్ని సాగుచేస్తుండేవారు. కానీ కొన్నేళ్లుగా రైతులు అరటి, దానిమ్మ, బత్తాయి, మామిడిని సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో వినూత్న ప్రయోగాలు చేస్తూ ఆపిల్, ద్రాక్ష వంటి పంటల్ని సాగు చేస్తున్నారు. వ్యవసాయంలో వినూత్న పద్ధతులతో అధిక దిగుబడి సాధిస్తున్నారు. అనంతపురానికి చెందిన రమణారెడ్డి అనే రైతు ఆపిల్ సాగుతో వార్తల్లో నిలిచారు. తొలి ప్రయత్నంలో విఫలమైనా సరే పట్టుదలతో రెండో ప్రయత్నంలో విజయం సాధించారు. చీనీ సాగు ఎప్పటి నుంచో ఉన్నా సరే రామాంజులు రెడ్డి మాత్రం వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం చేసి భారీ లాభాలు పొందారు. సరైన ప్రణాళికతో అధికారుల సూచనలు పాటిస్తూ సేంద్రీయ ఎరువులు ఉపయోగించి సక్సెస్ అయ్యారు.. మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలిచారు రామాంజులు రెడ్డి.కడప జిల్లాలోజీడి మామిడి, సన్న నిమ్మ, జామ, తైవాన్ జామ, సపోటా, నేరేడు, చింత, సీతాఫలం, దానిమ్మ, అంజూర, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, పనస, ఆపిల్ బేర్ సాగును ప్రోత్సహిస్తున్నారు. రోజా, మల్లె, మునగ, ఆయిల్ పామ్, కోకో, రబ్బరు, వెదురు, సిల్వర్ ఓక్, జాప్రా వంటివి కూడా సాగు చేసేలా చూస్తున్నారు. రైతులకు ఉచితంగా మొక్కలు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ మొక్కల్ని కుటుంబానికి 5 ఎకరాలు, అంతకంటే తక్కువ భూమి కలిగిన గ్రామీణ ప్రాంత రైతులకు మాత్రమే అందిస్తారు.
అధికారుల