
పెద్ద స్క్రీన్, మంచి పిక్చర్ క్వాలిటీ, గేమింగ్‌కు సరిపోయే హై రిఫ్రెష్ రేట్ కోసం చూస్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని హైసెన్స్ కొత్త టీవీ సిరీస్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. E8S 144Hz ULED మినీ-ఎల్ఈడీ టీవీ సిరీస్‌ను గురువారం విడుదల చేసింది.ఈ సిరీస్‌లో 55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాలు, 85 అంగుళాల మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి.
ప్రారంభ ధర రూ.57,990గా నిర్ణయించింది. అయితే ఇవి పరిమిత కాల ఆఫర్ ధరలేనని కంపెనీ తెలిపింది.కొత్త టీవీల్లో ప్రధాన ఆకర్షణ 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్. సాధారణ టీవీలతో పోలిస్తే వేగంగా కదిలే దృశ్యాలు మరింత అద్భుతంగా కనిపిస్తాయని కంపెనీ చెబుతోంది.
ముఖ్యంగా గేమింగ్, స్పోర్ట్స్ కంటెంట్ చూసేవారికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.ఈ సిరీస్‌లో ULED మినీ-ఎల్ఈడీ డిస్ప్లేను అందించింది. ఫుల్ ఆరే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ ఉండటంతో చీకటి సన్నివేశాల్లో నలుపు రంగు మరింత స్పష్టంగా కనిపిస్తుందని, ప్రకాశవంతమైన దృశ్యాల్లోనూ బొమ్మలు బాగా కనిపిస్తాయని కంపెనీ తెలిపింది.పిక్చర్ క్వాలిటీ కోసం HDR10+ అడాప్టివ్, డాల్బీ విజన్ IQ, ఫిల్మ్‌మేకర్ మోడ్ వంటి ఫీచర్లను అందించింది.
రంగులు సహజంగా కనిపించేలా పాంటోన్ ధ్రువీకరణ పొందిన Hi-QLED కలర్ టెక్నాలజీని ఉపయోగించింది. ఈ టీవీలు VIDAA స్మార్ట్ ఓఎస్‌పై పనిచేస్తాయి. ప్రముఖ ఓటీటీ యాప్‌లకు మద్దతు ఉంటుంది. రిమోట్ లేకుండా వాయిస్ కమాండ్లతో కూడా నియంత్రించవచ్చు.పిక్చర్ క్వాలిటీని మెరుగుపరిచేందుకు కంపెనీ హై-వ్యూ ఏఐ ఇంజిన్‌ను అందించింది.
గదిలో వెలుతురు పరిస్థితులను బట్టి స్క్రీన్ బ్రైట్నెస్, కలర్స్‌ను ఆటోమేటిక్‌గా