
ఇరాన్-అమెరికా మధ్య తాజాగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన గంటల్లోనే మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 16 మంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది.
దీంతో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ ఆందోళనకరంగా మారింది.దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాలపై గురువారం రాత్రి నుంచి దాడులు కొనసాగుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు హెజ్బొల్లా కూడా ఆ ప్రాంతంలో తీవ్ర ఘర్షణ జరుగుతోందని తెలిపింది.
ఈ పరిణామం ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన తాజా ఒప్పందానికి సవాల్‌గా మారింది. ఆ ఒప్పందం ప్రకారం లెబనాన్‌తో సహా అన్ని ప్రాంతాల్లో సైనిక చర్యలు వెంటనే నిలిపివేయాలి. అలాగే లెబనాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవించాల్సి ఉంటుంది.అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం వెనక్కి తగ్గేది లేదనే సంకేతాలు ఇచ్చారు.
హెజ్బోల్ంలా నుంచి ముప్పు పూర్తిగా తొలగే వరకు లెబనాన్‌లో సైనిక చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్-అమెరికా ప్రతినిధుల మధ్య స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన తదుపరి చర్చలు కూడా వాయిదా పడ్డాయి. శాశ్వత శాంతి ఒప్పందంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ.
వాన్స్.. స్విట్జర్లాండ్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. అధికారికంగా సాంకేతిక కారణాలే కారణమని వైట్‌హౌస్ తెలిపింది. కానీ, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో ఇరాన్ తన ప్రతినిధి బృందాన్ని పంపడంలో జాప్యం చేస్తోందన్న వార్తలు వెలువడ్డాయి.ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు.
దీంతో