
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Sun-neptune Square 2026 Effect On Zodiac: ఖగోళ శాస్త్రంలో ఏర్పడే గ్రహాల కదలికలకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు గ్రహాల మధ్య కోణాలు కూడా ఏర్పడతాయి.
దీని కారణంగా మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. 2026 జూన్ 26వ తేదీన అంతరిక్షంలో ఒక అరుదైన, అత్యంత సున్నితమైన ఖగోళ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది.. ముఖ్యంగా సూర్య-వరుణ గ్రహాల ప్రభావంతో కేంద్ర యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా ఎంతో వక్తివంతమైన యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
సూర్య-నెప్ట్యూన్ కేంద్ర యోగం? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జూన్ 26 తెల్లవారుజామున 4:06 గంటలకు ఆత్మకారకుడైన సూర్యుడు, రహస్యాలకు కారకుడిగా భావించే.. వరుణ గ్రహం ఒకరికొకరు సరిగ్గా 90 డిగ్రీల కోణంలో రాబోతున్నాయి. ఈ స్థితిని కేంద్ర యోగం అంటారు.
నెప్ట్యూన్ గ్రహాన్ని భ్రమలు, మోసాలు, తెలియని భయాలతో పాటు మానసిక అస్థిరతకు కారకుడిగా చెప్పుకుంటూ ఉంటారు. మరోవైపు సూర్యుడు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా కూడా భావిస్తారు. ఈ రెండు గ్రహాలు 90 డిగ్రీల కోణంలో రావడం వల్ల మానవుల జీవితాలపై ఊహించని ప్రభావం పడుతుంది..
ఈ కేంద్ర యోగం ప్రతికూల ప్రభావం వల్ల 5 రాశుల వారికి తీవ్ర మానసిక ఒత్తిడి, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ రాశులవారికి నష్టాలు తప్పవు? మేష రాశి (Aries): సూర్య-నెప్ట్యూన్ కేంద్ర యోగంతో ఎక్కువగా మేష రాశివారిపై ప్రభావం పడుతుంది.
తీవ్రమైన మానసిక గందరగోళ ప్రభావం ఏర్పడుతుంది. ఉద్యోగ రంగంలో సహోద్యోగులతో సమన్వయ లోపం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా చేతికి వచ్చిన పనులు కూడా చివరి నిమిషంలో నిలిచిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మిథున రాశి (Gemini): మిథున రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యం ఊహించని స్థాయిలో దెబ్బతింటుంది. అంతేకాకుండా ఆర్థికపరంగా తీవ్ర ఒడిదొడుకులు కూడా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికపరంగా కూడా నష్టపోతారు. అలాగే తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్రమైన సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరికి ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. కడుపు నొప్పితో పాటు కంటి నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.
సింహ రాశి (Leo): సింహ రాశికి అధిపతి సూర్యుడు కావడం వల్ల కేంద్ర యోగంతో వీరిపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కార్యాలయంలో వీరి ప్రతిష్టకు భంగం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు పై అధికారులతో ఊహించని విభేదాలు కూడా వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వీరికి ఈ సమయంలో ఆహంకారం కూడా పెరుగుతుంది.
తులా రాశి (Libra): మోస్ట్ పవర్ఫుల్ కేంద్ర యోగంతో తులా రాశివారి కుటుంబ జీవితం కూడా ఊహించని స్థాయిలో దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పాత విషయాల్లో కూడా కుటుంబ సభ్యుల మధ్య ఊహించని వివాదాలు కూడా తలెత్తే ఛాన్స్‌లు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడే క్రమంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఓపికగా ఉండడం వల్ల మాత్రమే ధన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
వీరికి ఈ సమయంలో ఊహించని