
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Telangana Registration Department Updates News: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూములకు సంబంధించిన క్రయ విక్రయాలు జరిపే వారికి, రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఒక ముఖ్యమైన గమనిక.
ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడబోతోంది.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దాని అనుబంధ ఆన్లైన్ సేవలు ఈ సమయంలో పనిచేయవని ఆ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారికంగా వెల్లడించారు..
షెడ్యూల్ చేసిన సర్వర్ మెయింటెనెన్స్ పనుల కారణంగానే ఈ తాత్కాలిక అంతరాయం ఏర్పడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఐదేళ్ల తర్వాత అప్‌గ్రేడ్.. గడిచిన ఐదేళ్ల కాలంలో సర్వర్ల నిర్వహణ పనులు ఈ స్థాయిలో చేపట్టడం ఇదే తొలిసారి. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచడమే కాకుండా అన్ని రకాల సెక్యూరీలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ తాత్కాలికంగా బ్రేక్ అని ఐజీ తెలిపారు.
అప్డేట్ చేసిన తర్వాత సర్వర్ వ్యవస్థ ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా మరింత వేగంగా పనిచేస్తాయని తెలిపారు. ఆన్లైన్ డేటాతో పాటు భద్రతా ప్రమాణాలు (Security Standards) మరింత పటిష్టం కాబోతున్నాయని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నాణ్యత పెరిగి..
ప్రజలకు సులభతరమైన అనుభూతి లభిస్తుందని తెలిపారు.. స్మార్ట్ ప్లానింగ్.. ఈ మూడు రోజుల విరామం వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తుగా వ్యూహాత్మక
ప్లాన్ వేసిన్నట్లు తెలుస్తోంది.. జూన్ 26వ తేదిన మొహర్రం పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం ఉండమే కాకుండా.. జూన్ 28 ఆదివారం సాధారణ వీక్లీ ఆఫ్, జూన్ 27 కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే ప్రభుత్వ ఆఫీసులు మళ్లీ తిరిగి ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రమే ఈ భూ రిజిస్ట్రేషన్లు బంద్ ఉంటాయి.. ఈ విధంగా ప్లాన్ చేయడం వల్ల పని దినాల్లో కేవలం ఒక్క రోజు మాత్రమే రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోతాయని, తద్వారా ప్రజలపై పడే ప్రభావం ఒకటే రోజు ఉంటుందని ఐజీ వివరించారు.
29 నుంచి సేవలు యథావిధి.. ఈ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రజలు తమ భూ క్రయ విక్రయాలతో పాటు రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను ముందస్తుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 29వ తేదీ సోమవారం నుంచి అన్ని సేవలు ఎప్పటిలాగే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అధికారులు చేపట్టే ఈ సాంకేతిక అభివృద్ధి పనులకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.