
గతంలో నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ తర్వాత టెలిగ్రామ్ యాప్ లోనే సర్కులేట్ అయ్యాయన్న కారణంతో కేంద్రం ఈసారి ఈ యాప్ పై తాత్కాలిక నిషేధం విధించింది. ఎల్లుండి నీట్ పరీక్ష ముగిసిన తర్వాత ఈ నెల 22 వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే ఈ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. పరీక్షల్లో అవకతవకలపై ఉన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సమంజసమే అని పేర్కొంది.
ఈ మేరకు సమాచార సాంకేతిక చట్టం 2000లోని సెక్షన్ 69A కింద కేంద్రం జారీ చేసిన నిరోధక ఉత్తర్వును సవాలు చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కరియా కొట్టివేస్తూ ఈ తీర్పును వెలువరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు అతి తక్కువ ఆంక్షలతో కూడినవని, ఈ ఉత్తర్వు తగినది కాదని చెప్పలేమని తెలిపింది.
నీట్-యూజీ వివాదంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవస్థీకృత మోసపూరిత నెట్‌వర్క్‌లు టెలిగ్రామ్‌ను వాడుతున్నాయనే ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ తాత్కాలిక ఆంక్షలు విధించింది
.