
ఇంటర్నెట్‌డెస్క్: నీట్-యూజీ-2026 రీటెస్టుకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (NTA) కీలక చర్యలు చేపట్టింది. విద్యార్థుల కోసం ఒక అధికారిక వాట్సప్ సేవలను ప్రవేశపెట్టింది.
ఇదే సమయంలో పరీక్షకు సంబంధించి వస్తున్న తప్పుడు ఎస్ఎంఎస్లు, ఈ-మెయిల్‌ను నమ్మోద్దని హెచ్చరికలు జారీ చేసింది.
+91 78279 80287 నంబరుతో ఎన్టీఏ ఒక అధికారిక వాట్సప్‌ను ప్రారంభించింది. ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ అనే పేరుతో ఉండే ఈ ఖాతాకు బ్లూ టిక్ ఉంటుంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సంబంధించిన వివరాలతో పాటు పరీక్షకు సంబంధించిన అన్ని అప్డేట్లు ఈ నంబర్ నుంచే వస్తాయని ఎన్టీఏ పేర్కొంది. ఇలా బ్లూటిక్ లేకుండా.. ఇదే పేరుతో వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులను కోరింది. అభ్యర్థులకు సంబంధించిన ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు, చెల్లింపులు వంటివి తాము కోరమని.. వీటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాట్సప్ నోటిఫికేషన్లతో పాటు అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతూ.. రిమైండర్ SMSలు, ఈ- మెయిల్లను కూడా పంపుతున్నట్లు వెల్లడించింది. అధికారిక ఎస్ఎంఎస్లు NICPEP అనే సెండర్ ID నుంచి, ఇమెయిల్‌లు no-reply.neet.nta@nic.in నుంచి మాత్రమే వస్తాయని తెలిపింది. ఈ సందర్భంగా మే 3న పరీక్ష కోసం జారీ చేసిన అడ్మిట్ కార్డులు.. పునఃపరీక్షకు చెల్లవని విద్యార్థులకు గుర్తుచేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.