
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. సోషల్ మీడియాలో స్పందించిన కొందరు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి చూడదగ్గ వినోదాత్మక చిత్రంగా అభివర్ణిస్తున్నారు.
ముఖ్యంగా సమంత నటన సినిమాకు ప్రధాన బలమని చెబుతున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో ఆమె ప్రదర్శన ఆకట్టుకుందని పలువురు ప్రశంసలు కురిపించారు. కొందరు అభిమానులు అయితే సమంత కెరీర్లో ఇది మరో మంచి హిట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే చిత్రంలోని నేపథ్య సంగీతం, కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.
కొన్ని ట్వీట్లలో సమంతకు లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు మరోసారి సరిపోతుందని పేర్కొన్నారు. అయితే అందరి అభిప్రాయం ఒకేలా లేదు. కొందరు ప్రేక్షకులు మొదటి భాగం బాగుందని, రెండో భాగం ఆశించిన స్థాయిలో లేదని వ్యాఖ్యానించారు. కథ చాలా పరిచయమైనదిగా అనిపించిందని, కొన్ని సన్నివేశాల నడక నెమ్మదిగా ఉందని అభిప్రాయపడ్డారు.
మరికొందరు మాత్రం సినిమా ఒక్కసారి చూడదగ్గ స్థాయిలో ఉందని చెబుతున్నారు. ఇక సినిమాలో కనిపించిన శ్రీముఖి పాత్రకు కూడా మంచి స్పందన వస్తోంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, నటన ప్రేక్షకులను ఆకట్టుకుందని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి.
మా ఇంటి బంగారం సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సమంత నటన, యాక్షన్ సన్నివేశాలు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు సినిమాకు ప్లస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి. మరోవైపు కథనం, కొన్ని సన్నివేశాలపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
సమయం గమనించాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను
తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
పూర్తి స్థాయి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే తొలి రోజు కలెక్షన్లు మరియు ప్రేక్షకుల స్పందనను మరికొంత