
Al-Qaeda terrorist group : పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్‌లో అల్ ఖైదా ఉగ్రవాద ముఠా ఘోర రక్తపాతాన్ని సృష్టించింది. ఆ దేశ రాజధాని నియామీలోని అంతర్జాతీయ విమానాశ్రయం మరియు దానికి ఆనుకుని ఉన్న సైనిక స్థావరం (మిలిటరీ బేస్)పై సాయుధ ఉగ్రవాదులు ఆకస్మికంగా విరుచుకుపడ్డారు.
ఈ దారుణ దాడిలో 13 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన ‘జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమిన్’ (JNIM) ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అధికారికంగా ప్రకటించుకుంది. విమానాశ్రయం వంటి అత్యంత రక్షణ వలయం ఉన్న వ్యూహాత్మక ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడితో ఆఫ్రికా ఖండంలో భద్రతా లోపాలు మరియు ఉగ్రవాద కోరలు ఏ స్థాయిలో విస్తరిస్తున్నాయనేది మరోసారి స్పష్టమైంది.
Read Also : గ్రీన్ కార్డ్ ఆశలపై యూఎస్సీఐఎస్ నీళ్లు అత్యాధునిక ఆయుధాలతో ఎయిర్‌పోర్ట్‌లోకి చొరబడిన సాయుధ దుండగులకు, నైజర్ రక్షణ దళాలకు మధ్య దాదాపు రెండు గంటల పాటు హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల ముప్పేట దాడిని తిప్పికొట్టేందుకు సైన్యం గట్టిగా పోరాడింది.
ఈ ఆపరేషన్‌లో భద్రతా దళాలు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి 22 మంది టెర్రరిస్టులను అక్కడికక్కడే హతం చేసినట్లు మరియు దాడిలో పాల్గొన్న మరో 20 మంది ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్నట్లు నైజర్ ప్రభుత్వ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం విమానాశ్రయ పరిసర ప్రాంతాలను సైన్యం పూర్తి ఆధీనంలోకి తీసుకుని కార్డన్ సెర్చ్ నిర్వహిస్తోంది.
ఈ ఘటనతో నైజర్ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. Pakistan: పాకిస్థాన్‌లోని గురుద్వారాలో సిక్కు దంపతుల హత్య..నిందితుడు అరెస్ట్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
మాటల యుద్ధం
Donald Trump: ఇజ్రాయెల్, హిజ్బుల్లా వెంటనే కాల్పుల విరమణ పాటించాలి: డోనాల్డ్ ట్రంప్
Professor Mohammed Waseem Hanif: ప్రొఫెసర్ వసీం హనీఫ్‌కు బ్రిటన్‌లో అరుదైన గౌరవం
Smartphones : ఆఫ్ఘనిస్తాన్‌లో స్మార్ట్ఫోన్లపై నిషేధం..
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. US, Iran Sign Peace Deal : అమెరికా, ఇజ్రాయెల్ మధ్య