ధీరజ్ కోసం కారు కొనాలని ఫిక్స్ అయిన ప్రేమ.. అందుకోసం కావాల్సిన పది లక్షల్నీ ఎలా సంపాదించాలా? అన్న ఆలోచనలో పడింది. ఈరోజు (జూన్ 19) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. పది లక్షలు సంపాదించాలంటే దాదాపు రెండేళ్లు పట్టేస్తుంది.
కారు కొనడానికి రెండేళ్లు వెయిటింగ్ అంటే.. మన వల్ల కాదు అని అద్దం ముందు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటుంది ప్రేమ. ఇంతలో ధీరజ్ వచ్చి.. అద్దం కంటే నువ్వే అందంగా ఉన్నావ్ లే కానీ ఏమైందీ అని అంటాడు ధీరజ్. దాంతో ప్రేమ.. ధీరజ్ని హగ్ చేసుకుని..
కారు పోయిందనే బాధ లేదరా.. మళ్లీ డెలివరీ బాయ్‌గా మారావ్.. నీ లైఫ్‌ని ఎక్కడ మొదలు పెట్టావో మళ్లీ అక్కడికే వచ్చింది’ అని బాధపడుతుంది ప్రేమ. బాధపడితే కారు తిరిగి వస్తుందా? కొన్నాళ్ల తరువాత ఈ కష్టాలన్ని తీరిపోతాయి అని అంటాడు ధీరజ్.
ఎలా తీరుతాయిరా.. కారు ఎలా కొంటావ్.. నీ కాళ్లపై నువ్వు నిలబడి.. నీ లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకుంటావ్ అని అంటుంది ప్రేమ. అడుగుపడటం కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ.. నిలబడటం మాత్రం పక్కా.. నువ్వు నాకు ధైర్యంగా నిలబడు చాలు ఎన్నిసార్లు పడినా లేస్తాను’ అంటూ ప్రేమని గుండెలకు హత్తుకుంటాడు ధీరజ్.కారు కొనడానికి ఒక్క అవకాశం..
శ్రీవల్లి ఏడుపు కారు తీసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటే బావుండు అని అంటుంది ప్రేమ. అటు శ్రీవల్లి.. కుటుంబాల మధ్య గీతలు చెరిగిపోతుంటే నాకు ఎక్కడ విలువ ఉంటుందంటూ చిచ్చు పెట్టడానికి సిద్ధం అవుతూ ఉంటుంది. ఇంతలో బల్లక్కాయ్ అంటూ ఎంట్రీ ఇస్తారు నర్మద, ప్రేమలు.
మా బల్లక్క ఏం చేస్తుందీ అంటూ వెటకారంగా అడుగుతారు. హా.. మామయ్య గారు నీ బండి ఎక్కి వచ్చారు కదా.. తెగ పొంగిపోతున్నా అని అంటుంది శ్రీవల్లి. హా కనిపిస్తుందిలే ఎంత పొంగిపోతున్నావో.. నమ్మేశాంలే అని అంటుంది నర్మద. నా మంచితనాన్ని మీరు ఎప్పటికీ
అర్థం చేసుకోలేరు అని అంటుంది శ్రీవల్లి. ట్యాబ్లెట్స్ ఎక్కడున్నాయ్.. దొరికిపోయానే అర్థం చేసుకున్నాం కాబట్టే కదా.. నిన్నూ నీ కడుపుని కళ్లల్లో పెట్టి చూసుకోవడానికి వచ్చిందీ అని అంటుంది ప్రేమ. ఆ మాటతో శ్రీవల్లి.. మళ్లీ నా మీద కొత్త కాన్సెప్ట్ ప్రయోగించబోతున్నారా? ఏంటదీ అని అంటుంది. ఈసారి ఛాన్స్ నీకే ఇవ్వాలని అనుకుంటున్నాం. ఏం కావాలో చెప్పూ అని అంటారు నర్మద, ప్రేమలు. ‘అబ్బా మీ ప్రేమకి చాలా పెద్ద థాంక్స్ కానీ.. నేను ఆల్రెడీ అన్నీ చేసేశాను.. తినేశాను కూడా.. ఇక నిద్రపోవడమే ఆలస్యం అని అంటుంది శ్రీవల్లి. ‘అవునా మరి మందులు వేసుకున్నావా? అని అంటే.. ‘హా వేసేసుకున్నా అని శ్రీవల్లి అంటే.. వేసుకోలేదని సుకన్య అంటుంది. అదేంటి ఇద్దరూ తలో మాటా చెప్తున్నారూ.. ఆ ట్యాబ్లెట్స్ ఎక్కడున్నాయో తీయండి అని అంటారు నర్మద, ప్రేమలు. అవన్నీ దొంగ ట్యాబ్లెట్స్ అన్నమాట.. ఎందుకు చెల్లాయ్లూ అని శ్రీవల్లి అంటే.. ట్యాబ్లెట్స్ ఎందుకంటావ్ ఏంటీ బుద్దిలేకుండా? నువ్వు మింగడానికి.. అని అంటుంది ప్రేమ. ‘నేను మింగుతానులే చెల్లాయ్లూ.. మీరు మింగేసేలా చూడకుండా వెళ్లిపోండి.. అని అంటుంది శ్రీవల్లి. ‘అలా ఎలా వదిలేస్తాం అక్కాయ్.. నీతో మందులు మింగించకపోతే అత్తయ్య గారు మాపై ఆగ్రహిస్తారు సుమీ.. అందుకే మా ముందే మందులు వేసుకోవచ్చు కదా తియ్ తియ్’ అని అంటుంది నర్మద. శ్రీవల్లి దిక్కులు వెతికేసరికి.. ఏంటీ ట్యాబ్లెట్స్ అంటూ ఒకర్నొకరు చూసుకుంటున్నారూ.. అంటే మీరు మొన్న చూపించినవి దొంగ ట్యాబ్లెట్స్ అన్నమాట అని అంటుంది ప్రేమ. నీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కదా.. చెప్పు బల్లక్కాయ్ లేదంటే చూడు చెల్లాయ్ నువ్వు నన్ను అనుమానించు కానీ.. నా కడుపుని కాదు.. మందులు ఇవ్వమని చూస్తున్నానంతే అని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది శ్రీవల్లి. ఆ మందులేవో ఇచ్చి చావవే.. లేదంటే మా చెల్లాయ్లకు అనుమానం ఎక్కువౌతుంది అని అంటుంది శ్రీవల్లి. దాంతో సుకన్య.. మందుల బాక్స్‌ని తీసుకుని వస్తుంది. దాన్ని లాక్కున్న నర్మద.. ‘బల్లక్కాయ్... ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కదా.. లేదంటే చెప్పు తెల్లార్లూ మోషన్స్ అవుతాయ్.. అని అంటుంది. ‘చెప్పాను కదా.. నన్ను అనుమానించండి కానీ.. నా కడుపుని కాదని’ అని అంటుంది శ్రీవల్లి. దాంతో ప్రేమ.. ఇక మొదలుపెడదామా అంటూ ట్యాబ్లెట్స్‌ని శ్రీవల్లి నోట్లో కుక్కుతుంది. జాడించేసిందిగా.. సరే ఈ రాత్రికి ఈ డోస్ చాలు.. రేపు మార్నింగ్ మరో డోస్ ఇస్తాం అని వెళ్తారు నర్మద, ప్రేమలు. ఇక ఇంకేముందీ.. మందుల ఎఫెక్ట్‌తో తెల్లార్లూ వాష్ రూంకి తిరుగుతూ ఉంటుంది శ్రీవల్లి. అటు ఇడ్లీగాడు.. రైస్ మిల్లులో కొట్టేసిన డబ్బులతో భాగ్యానికి పట్టీలు కొని తీసుకుని వస్తాడు. వాటిని చూసి మురిసిపోతుంది భాగ్యం. ఎక్కడివీ అని భాగ్యం అడుగితే.. ఈ ప్రశ్నలు ఎందుకూ.. ముందు కాలు ఇలా ఇవ్వు అంటూ భాగ్యం కాలిని ఒళ్లో పెట్టుకుని పట్టీలు పెడతాడు ఇడ్లీ. గజ్జెగల్లు మన్నదో గుండె జల్లుమన్నదో అంటూ సాంగ్ వేసుకుంటాడు ఇడ్లీ. ముసలోడికి దసరా పండుగ.. రేయ్ సచ్చినోడా ఎంత పని చేశావ్ రా సర్లే కానీ.. ఈ పట్టీలు ఎలా కొన్నావ్ అని అడుగుతుంది భాగ్యం. దాంతో ఇడ్లీ గాడు.. రైస్ మిల్లులో రూ.20 వేలు కొట్టేశాను.. వాటితోనే కొన్నాను అని అంటాడు ఇడ్లీ. దాంతో భాగ్యం.. ఓరి సచ్చినోడా కొంప ముంచావ్ కదరా అంటూ చావబాదుతుంది. ఆ రైస్ మిల్లుని మొత్తం మన గుప్పెట్లో పెట్టుకుని కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనీ.. ఇలాంటి చిల్లర దొంగతనాలు ఏంట్రా పనికిమాలినోడా.. పనికిమాలిన వెధవా అంటూ చితకబాదేస్తుంది భాగ్యం. చూడు భాగ్యం.. ఎప్పుడో కుంభస్థలం కొడదాం అని చూస్తూ ఉంటే.. మనకి మిగిలిది ఏముండదు.. రూపాయి రూపాయి వెనకేస్తేనే కదా మనకేమైనా మిగిలేదీ అని అంటాడు ఇడ్లీ. దాంతో సరేలే అని అంటుంది భాగ్యం. మరి చాలారోజులైంది ఏమైనా ఉందా అంటూ సిగ్గుపడుతూ భాగ్యాన్ని లోపలికి తీసుకుని వెళ్తాడు ఇడ్లీ. ఆ తరువాత ఏమౌద్దో చూసే వాళ్ల ఊహకే వదిలేశారు.ప్రేమా నీకో గుడ్ న్యూస్.. నీ డాన్స్‌కి పది లక్షలు అటు ప్రేమ స్నేహితురాలు గీత ఫోన్ చేసి.. నీకో గుడ్ న్యూస్.. నువ్వు చిన్నప్పటి నుంచి కష్టపడి నేర్చుకున్న డాన్స్‌కి పది లక్షలు రాబోతున్నాయి. సిటీలో గ్రాండ్‌గా డాన్స్ కాంపిటేషన్ పెడుతున్నారు. ఆ కాంపిటేషన్‌లో నువ్వు పార్టిసిపేట్ చేస్తే.. ఖచ్చితంగా నువ్వే గెలుస్తావ్ అని అంటుంది ప్రేమ స్నేహితురాలు. ఆ మాట వినగానే ప్రేమ ఉప్పొంగిపోతుంది. ధీరజ్‌కి కారు కొనివ్వడానికి ఆ దేవుడు ఈ రూపంలో దారి చూపిస్తున్నట్టు ఉన్నాడు అని సంబరపడిపోతుంది. ఎల్లుండే లాస్ట్ డేట్.. నీ పేరు మీద అప్లై చేయనా? అని అడుగుతుంది గీత. ఒక్క నిమిషం ఆగవే.. ధీరజ్ని అడిగిచెప్తా అని అంటుంది ప్రేమ. ఆ దేవుడే దారి చూపించాడు.. ఇక బయటకు వచ్చి.. ధీరజ్ని వెతుకుతుంది ప్రేమ అయితే ఎక్కడా కనిపించకపోయేసరికి.. గీతతో అప్లై చేసెయ్ అని అంటుంది ప్రేమ. ధీరజ్‌కి చెప్పొచ్చు లేవే.. నీ ఫొటోస్‌తో పాటు.. డాన్స్ పెర్ఫామెన్స్ వీడియోస్ పంపించు.. నేను అప్లై చేస్తా.. సెలెక్ట్ అయితే అప్పుడు చూడొచ్చు అని అంటుంది గీత. దాంతో ఆమె అడిగిన వన్నీ పంపిస్తుంది ప్రేమ. ‘నా భర్తకి కారు కొనివ్వడానికి నువ్వే దారి చూపించావ్ అని అనుకుంటున్నాను.. నేను గెలిచేలా చేయి స్వామీ అంటూ దేవుడ్ని వేడుకుంటుంది ప్రేమ. కట్ చేస్తే.. భద్రావతికి కోర్టు నుంచి నోటీసులు వస్తాయి. వచ్చే వారం నుంచి అమూల్య పెట్టిన కేసుపై వాదనలు జరగబోతున్నాయి.. నా మేనల్లుడికి శిక్ష పడే పరిస్థితి రానివ్వను అని అంటుంది. విశ్వక్‌కి కోర్టు నోటీసులు.. కళ్ల ముందే పరిష్కారం.. అతనే రామరాజు ఏం చేశారు మీరు.. నా కొడుకుని అరెస్ట్ చేసినప్పుడు ఆపలేకపోయారు. ఇప్పుడు కోర్టులో వాదనలు అంటే.. ఆ అమూల్య సాక్ష్యం బలంగా పనిచేస్తుంది. అప్పుడు నా కొడుక్కి శిక్ష పడుతుంది. నెలరోజులు కానీ వాడికి బెయిల్ రాలేదు.. ఇప్పుడు వాడికి శిక్ష పడకుండా ఎలా ఆపుతారు. నా కొడుకుని ఎలా బయటపడేస్తారు అని నిలదీస్తుంది విశ్వక్ తల్లి. నిజమే అక్కా.. బెయిల్ రావడమే కష్టం అయ్యింది.. ఇప్పుడు తీర్పు మనకి ఎలా అనుకూలంగా వస్తుంది.. వీడికి శిక్ష పడకుండా ఎలా తప్పించగలం అని అంటాడు సేనాపతి. చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు.. కళ్ల ముందు పరిష్కారం పెట్టుకుని ఇంతలా కంగారు పడతారేంట్రా అని అంటుంది శారదాంబ. కళ్ల ముందు పరిష్కారమా? ఎవరూ అని భద్రావతి అడిగితే.. ఇంకెవరూ రామరాజూ అని అంటుంది శారదాంబ.