
మాజీ మంత్రి కొడాలి నాని పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుతో సహా నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పైన కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యల పైన కేసు నమోదు అయింది. ఇప్పుడు ఈ కేసులో నాని ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
దీంతో.. ఇప్పుడు ఈ కేసులో విచారణ ముందుకు కొనసాగనుంది. ఈ వ్యవహారంలో చోటు చేసుకునే పరిణామాల పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.వైసీపీ ముఖ్య నేత.. మాజీ మంత్రి కొడాలి నానిపై ప్రాసిక్యూషన్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2021 పంచాయతీ ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో విచారణ ముందుకు సాగనుంది.
పంచాయతీ ఎన్నికల సమయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి అప్పట్లో కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక పంపించారు.
ఆ నివేదిక ఆధారంగా 2021లోనే స్థానిక న్యాయస్థానం అనుమతి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. సాయికృష్ణ ఎపిసోడ్ లో సీఐ నాగరాజు పై హత్యాయత్నం కేసు..!!ప్రభుత్వం ప్రాసిక్యూషన్ కు అనుమతితోకాగా, ఆ సమయంలో కొడాలి నాని రాష్ట్ర మంత్రిగా కొనసాగుతుండటంతో ఆయనపై కేసు విచారణ చేపట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా అవసరమైంది.
దీంతో కేసు తదుపరి ప్రక్రియ పెండింగ్లో ఉండిపోయింది. తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ పంపిన నివేదికను పరిశీలించిన రాష్ట్ర హోంశాఖ, ప్రాసిక్యూషన్కు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
మాజీ మంత్రి కొడాలి నాని పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుతో సహా నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పైన కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యల పైన కేసు నమోదు అయింది. ఇప్పుడు ఈ కేసులో నాని ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో.. ఇప్పుడు ఈ కేసులో విచారణ ముందుకు కొనసాగనుంది. ఈ వ్యవహారంలో చోటు చేసుకునే పరిణామాల పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.వైసీపీ ముఖ్య నేత.. మాజీ మంత్రి కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2021 పంచాయతీ ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో విచారణ ముందుకు సాగనుంది. పంచాయతీ ఎన్నికల సమయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి అప్పట్లో కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక పంపించారు. ఆ నివేదిక ఆధారంగా 2021లోనే స్థానిక న్యాయస్థానం అనుమతి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. సాయికృష్ణ ఎపిసోడ్ లో సీఐ నాగరాజు పై హత్యాయత్నం కేసు..!!ప్రభుత్వం ప్రాసిక్యూషన్ కు అనుమతితోకాగా, ఆ సమయంలో కొడాలి నాని రాష్ట్ర మంత్రిగా కొనసాగుతుండటంతో ఆయనపై కేసు విచారణ చేపట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా అవసరమైంది. దీంతో కేసు తదుపరి ప్రక్రియ పెండింగ్‌లో ఉండిపోయింది. తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ పంపిన నివేదికను పరిశీలించిన రాష్ట్ర హోంశాఖ, ప్రాసిక్యూషన్‌కు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. దీంతో.. ఈ కేసులో కొడాలి నాని ని విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. 2024 ఎన్నికల ఫలితాల తరువాత రాజకీయంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న కొడాలి నాని తాజాగా తిరిగి యాక్టివ్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సూచన మేరకు తిరిగి పోటీకి సిద్దం అవుతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాసిక్యూషన్ వ్యవహారంతో చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
దీంతో.. ఈ కేసులో