
PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు రంగం సిద్దమైంది. కేంద్రం విడుదల చేసే సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఈ ఆర్దిక సంవత్సరం తొలి విడత నిధులను విడుదల చేసేందుకు నిర్ణయించింది. దీంతో.. కేంద్రం నుంచి రూ 2 వేలు.. ఏపీ ప్రభుత్వం నుంచి రూ 4 వేలు కలిపి అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో ఒకే సారి రూ 7 వేలు చొప్పున జమ కానుంది.
కాగా, ఈ సారి నిధులు అందే వారి జాబితాలను ఖరారు చేసారు.అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం రెండో ఏడాది (2026-27) మొదటి విడత నిధులు, పీఎం కిసాన్ 23వ విడత నిధులను రేపు (శనివారం) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నాయి. పీఎం కిసాన్ నిధులను పశ్చిమబెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా 20న దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ ఉత్సవ్ దివ్సగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే అన్నదాత సుఖీభవ నిధులను అదే రోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసి, లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
గత ఆర్దిక సంవత్సరంలో పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులను మూడు విడతల్లో ప్రభుత్వం అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ ఏడాది అదే విధంగా నిధుల విడుదలకు సిద్దమైంది. సాయికృష్ణ ఎపిసోడ్ లో సీఐ నాగరాజు పై హత్యాయత్నం కేసు..!!రేపు రైతుల ఖాతాల్లో రూ 7 వేలు జమఏపీలో అన్నదాత సుఖీభవ పథకం కింద 2026-27లో మొదటి విడతగా ప్రతి లబ్ధిదారుకి రూ.7వేలు చొప్పున జమ కానున్నది.
ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు, కేంద్రం రూ.2వేలు చెల్లించనున్నాయి. రాష్ట్రంలో 46,85,838 మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.3,125.47కోట్లు జమ కానున్నాయి. ఇందులో పట్టాదారు రైతు కుటుంబాలు 45,69,817, అటవీ భూసాగు హక్కుదారులు
PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు రంగం సిద్దమైంది. కేంద్రం విడుదల చేసే సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఈ ఆర్దిక సంవత్సరం తొలి విడత నిధులను విడుదల చేసేందుకు నిర్ణయించింది. దీంతో.. కేంద్రం నుంచి రూ 2 వేలు.. ఏపీ ప్రభుత్వం నుంచి రూ 4 వేలు కలిపి అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో ఒకే సారి రూ 7 వేలు చొప్పున జమ కానుంది. కాగా, ఈ సారి నిధులు అందే వారి జాబితాలను ఖరారు చేసారు.అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ పథకం రెండో ఏడాది (2026-27) మొదటి విడత నిధులు, పీఎం కిసాన్‌ 23వ విడత నిధులను రేపు (శనివారం) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నాయి. పీఎం కిసాన్‌ నిధులను పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా 20న దేశవ్యాప్తంగా పీఎం కిసాన్‌ ఉత్సవ్‌ దివ్‌సగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే అన్నదాత సుఖీభవ నిధులను అదే రోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసి, లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ఆర్దిక సంవత్సరంలో పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులను మూడు విడతల్లో ప్రభుత్వం అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ ఏడాది అదే విధంగా నిధుల విడుదలకు సిద్దమైంది. సాయికృష్ణ ఎపిసోడ్ లో సీఐ నాగరాజు పై హత్యాయత్నం కేసు..!!రేపు రైతుల ఖాతాల్లో రూ 7 వేలు జమఏపీలో అన్నదాత సుఖీభవ పథకం కింద 2026-27లో మొదటి విడతగా ప్రతి లబ్ధిదారుకి రూ.7వేలు చొప్పున జమ కానున్నది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు, కేంద్రం రూ.2వేలు చెల్లించనున్నాయి. రాష్ట్రంలో 46,85,838 మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.3,125.47కోట్లు జమ కానున్నాయి. ఇందులో పట్టాదారు రైతు కుటుంబాలు 45,69,817, అటవీ భూసాగు హక్కుదారులు రూ.1,16,021 మంది ఉన్నారు. రాష్ట్ర వాటా కింద రూ.2,342.92కోట్లు, కేంద్ర వాటా రూ.782.5కోట్లు విడుదల కానున్నాయి. అయితే, ఇప్పటికే ఈ పథకం లబ్దిదారులు ఈ కేవైసీ తప్పని సరిగా నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎవరికైనా అర్హత ఉండి నిధులు అందని రైతులు ఉంటే.. వారు సమాచారం ఇవ్వాలని.. వారికీ నిధులు అందే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.