
ఫోన్ లేనిదే రోజు గడవని కాలం ఇది. నిత్యం చేతుల్లోనే మొబైల్ ఉంటుంది. అయితే రాత్రి పడుకోబోయే ముందు చాలామంది రాత్రంతా ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి వదిలేస్తారు. అప్పటికి బ్యాటరీ 100% ఫుల్ అవుతుంది. ఇలా రోజూ చేయడం వల్ల లిథియం-అయాన్ బ్యాటరీల జీవితకాలం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
ఈ ప్రభావం వెంటనే కనిపించకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాటరీ సామర్థ్యం తగ్గుతుంది. అప్పుడప్పుడు 100 శాతం ఛార్జ్ చేయడం పెద్ద సమస్య కాదు. కానీ రోజూ ఫుల్ ఛార్జింగ్ చేయడం బ్యాటరీపై ఒత్తిడి పెంచుతుంది. అందుకే, బ్యాటరీని 80 శాతం లేదా 90 శాతం మధ్యలో ఉంచడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
100 శాతం ఛార్జింగ్ చేయడం వల్ల ఇతర నష్టాలు కూడా ఉన్నాయి. ఫోన్ ఎక్కువగా వేడెక్కడం, ఛార్జింగ్ త్వరగా అయిపోవడం వంటివి జరుగుతాయి. ఇక ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడటం వంటివి బ్యాటరీ లైఫ్‌ను వేగంగా తగ్గిస్తాయి. ఈ సమస్యకు కొత్త ఫోన్లలో పరిష్కారం ఉంది.
ఐఫోన్ (iPhone), ఆండ్రాయిడ్ (Android) ఫోన్లలో ఉండే 'ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్', 'అడాప్టివ్ ఛార్జింగ్' వంటి ఫీచర్లు బ్యాటరీ 100 శాతం కాకుండా చూసుకుంటాయి. తద్వారా బ్యాటరీ లైఫ్‌ను కాపాడతాయి
.