
న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వయర్ వద్ద గురువారం మధ్యాహ్నం కాల్పుల కలకలం చెలరేగింది. వరుసగా తుపాకి పేలిన శబ్దాలు వినపడగానే టూరిస్టులు, స్థానికులు ప్రాణ భయంతో అక్కడినుంచి పరుగులు పెట్టారు. ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వయర్ వద్ద గురువారం మధ్యాహ్నం కాల్పుల కలకలం చెలరేగింది.
వరుసగా తుపాకీ పేలిన శబ్దాలు వినపడగానే టూరిస్టులు, స్థానికులు ప్రాణ భయంతో అక్కడినుంచి పరుగులు పెట్టారు. కాల్పులు జరిగిన సమయంలో అదే ప్రాంతంలో ఉన్న పోలీసులు వాయు వేగంతో స్పందించారు. అనుమానితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఈ కాల్పుల్లో ఓ వ్యక్తికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం సుమారు 3:40 గంటలకు జరిగింది.
ఎన్బీఏ ఛాంపియన్ 'న్యూయార్క్ నిక్స్' విజయోత్సవ పరేడ్‌తో లోయర్ మాన్‌హట్టన్ వీధులన్నీ జనంతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ కార్యక్రమం కోసం దాదాపు 10,000 మంది పోలీసులను మోహరించాం. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ చూడ్డానికి జనం పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు.
వారం రోజుల నుంచి సిటీలోనే ఉంటున్నారు. ఆ జనంతో టైమ్స్ స్క్వయర్ ప్రాంతం కిక్కిరిసిపోయింది’ అని అన్నారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వీడియోలో.. జనం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నారు. తుపాకీ పేలిన చప్పుడు వినబడగానే ఆగిపోయారు.
వరుసగా తుపాకీ పేలిన శబ్దాలు రావటంతో కొంతమంది భయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. మరి కొంతమంది బుల్లెట్ల నుంచి తప్పించుకోవడానికి నేలపై పడుకున్నారు. ఫిఫా ప్రపంచకప్: నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా మెక్సికో ఐటీ స్టాక్స్ ఎఫెక్ట్..
భారీ నష్టాల్లో సూచీలు