
టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో అదరగొడుతున్న భారత్‌కు షాక్ గాయంతో స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ మిగిలిన టోర్నమెంట్‌కు దూరం ఆమె స్థానంలో ప్రేమా రావత్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ Shreyanka Patil : మహిళల టీ20 ప్రపంచకప్2026లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి జోష్‌లో ఉన్న భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. టీమ్ఇండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయంతో మిగిలిన ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది.
బుధవారం (జూన్ 17)న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయాంక పాటిల్ గాయపడింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో తొలి బంతిని ఆపే క్రమంలో ఆమె కుడికాలు మెలికపడి కిందపడిపోయింది. తీవ్ర నొప్పితో బాధపడింది.
ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికి కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. సపోర్టింగ్ సాఫ్ట్ ఆమెను స్ట్రైచర్‌పై మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించారు. కోలుకునేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో ఆమె ఈ టోర్నమెంట్లో మిగిలిన మ్యాచ్‌ల నుంచి తప్పుకుంది.
Akshara Gupta : వైభవ్ తర్వాత బీహార్ నుంచి మరో క్రికెట్ సంచలనం.. వార్నీ.. 126బంతుల్లో 306 పరుగులు! కొట్టుడేకొట్టుడు.. Shreyanka Patil has been forced out of the #T20WorldCup due to injury with India naming her replacement 👀 — ICC (@ICC) June 19, 2026 శ్రేయాంక స్థానంలో యువ లెగ్‌స్పిన్నర్ ప్రేమా రావత్‌ను బీసీసీఐ జట్టులోకి ఎంపిక చేసింది.
ఈ మార్పుకు ఐసీసీ టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది. 24 ఏళ్ల ప్రేమా రావత్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేయలేదు. అయినప్పటికి ఈ లెగ్ బ్రేక్ బౌలర్ ఇటీవల జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లలో మంచి ప్రదర్శన చేసింది.
ఆసియాకప్ రైజింగ్ స్టార్స్‌లో 8 వికెట్లను పడగొట్టింది. డబ్ల్యూపీఎల్‌లో రెండు సీజన్లు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించింది. కేవలం ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆమె మూడు వికెట్లు తీసింది. దేశీయ క్రికెట్లో ఉత్తరాఖండ్ జట్టు విజయాల్లోనూ ప్రేమా రావత్ కీలక పాత్ర పోషించింది.
ఇండియా ఏ తరుపున