
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Nalgonda Ramannagudem Car Accident 3 Dead: గత కొంతకాలంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అనేక ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఒకరి అజాగ్రత్త వల్ల ఇతరుల ప్రాణాలు కూడా పోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. నల్లగొండ జిల్లా పెద్దావూర మండలం రామన్నగూడెం వద్ద ఈరోజు రెండు కార్లు ఒకదానికొకటి ఎదురుగా ఢీకొని నుజ్జునుజ్జు అయ్యాయి. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఇద్దరు తండ్రి కొడుకులు కాగా, మరొకరు SLBC లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.
ఈ ప్రమాదం ఈరోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. అసలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణాపాయంలో ఉన్న గాయపడిన వారిని హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నాగర్జున సాగర్ నుండి పెద్దావూర వెళ్తున్న కారును, హైదరాబాద్ నుండి ఏపీ వైపు వెళ్తున్న మరో వాహనం ఎదురుగా ఢీకొనడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ వస్తున్న తండ్రి కొడుకులు అక్కడికక్కడే మరణించగా, మరో కారులో ఉన్న SLBC సైట్ ఇంజనీర్ సాయికుమార్ కూడా మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలంలో వాహనాల శిథిలాలను తొలగిస్తున్నారు.
కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అతివేగంగా ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున చీకటిగా ఉండటం, వాహనాల వేగం ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని, పెద్ద శబ్దంతో కార్లు ఢీకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే, రెండు కార్ల ముందు భాగాలు పూర్తిగా నలిగిపోయాయి. ఇంజిన్ భాగాలు లోపలికి దూసుకుపోవడంతో వాహనదారులు సీట్లలోనే ఇరుక్కుపోయారు.
అతివేగ ప్రయాణం ప్రాణాంతకమని ట్రాఫిక్ పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయాల్లో ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచిస్తున్నారు. ఇలాంటి అజాగ్రత్త చర్యల వల్ల తమ ప్రాణాలకే కాకుండా, ఎదురుగా వచ్చే ఇతర వాహనదారుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అతివేగం, నిద్రమత్తు, మద్యం సేవించి వాహనం నడపడమే ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ ప్రమాదంతో మృతుల