సొనాలి బెంద్రే.. ఈ పేరు వినగానే 90ల నాటి కుర్రాళ్ల గుండెల్లో ఒక అందమైన అలజడి మొదలవుతుంది. టాలీవుడ్లో చేసింది కొన్ని సినిమాలే అయినా, తన అద్భుతమైన నటన, అమాయకత్వంతో కూడిన పక్కింటి అమ్మాయి లాంటి అందంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆమె చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ డిజిటల్ స్పేస్‌లో రాణిస్తున్న ఈ సీనియర్ నటి, చాలా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ టాలీవుడ్ వైపు చూస్తున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సొనాలీ బెంద్రే ప్రధానంగా బాలీవుడ్ నటి అయినప్పటికీ, తెలుగు చిత్రసీమలో ఆమె ప్రయాణం ఎంతో వైవిధ్యంగా, క్లాసిక్‌గా సాగింది.
2001లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన 'మురారి' చిత్రంతో ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా, ఆమెకు 'ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్' నామినేషన్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన 'ఇంద్ర' (2002), 'శంకర్ దాదా ఎంబీబీఎస్' (2004) చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచి ఆమె క్రేజ్‌ను అమాంతం పెంచేశాయి.
అలాగే కింగ్ నాగార్జునతో చేసిన 'మన్మధుడు' (2002) సినిమా టాలీవుడ్ హిస్టరీలోనే ఒక ట్రెండ్ సెట్టర్ లవ్ స్టోరీగా నిలవగా, కృష్ణవంశీ 'ఖడ్గం' చిత్రంలోనూ ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఒక 'పల్నాటి బ్రహ్మనాయుడు' మినహా ఆమె తెలుగులో నటించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం విశేషం.* ‘వెంకట్రామయ్య గారి తాలూకా’తో హీరోయిన్గా...
వెండితెరపైకి ఈటీవీ ప్రభాకర్ కూతురు ఎంట్రీ అయితే గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ టాలీవుడ్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒక క్రేజీ తెలుగు ప్రాజెక్ట్‌లో కీలకమైన, ప్రాధాన్యత కలిగిన పాత్ర కోసం చిత్ర బృందం ఆమెను సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
విషయమై చర్చలు సాగుతున్నాయని, అంతా అనుకూలిస్తే సోనాలి తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించడం ఖాయమని అంటున్నారు.* 'పెద్ది' కోసం 'గబ్బర్ సింగ్' త్యాగం.. రీ రిలీజ్ వాయిదా వేసిన బండ్ల గణేష్ సోనాలి బెంద్రే కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఒక గొప్ప పోరాటయోధురాలిగా నిలిచారు. 2018లో ఆమె 'స్టేజ్ 4 మెటాస్టాటిక్ క్యాన్సర్' బారిన పడ్డారు. బతికే అవకాశాలు కేవలం 30 శాతం మాత్రమే ఉన్నాయని వైద్యులు చెప్పినప్పటికీ, ఆమె అస్సలు అధైర్యపడలేదు. న్యూయార్క్‌లో కఠినమైన కీమోథెరపీ, సర్జరీల ద్వారా చికిత్స పొంది, తన అచంచలమైన ఆత్మవిశ్వాసంతో 2021లో క్యాన్సర్ రహితంగా మారి విజయవంతంగా బయటపడ్డారు. ఈ ప్రాణాంతక మహమ్మారిని జయించిన తర్వాత, ఆమె తిరిగి నటనపై దృష్టి పెట్టారు. ఇటీవల విడుదలైన ‘ది బ్రోకెన్ న్యూస్’, తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సిరీస్ ‘రాఖ్’ (Raakh)లలో తల్లిగా భావోద్వేగభరితమైన పాత్రల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సోనాలి బింద్రే, త్వరలోనే తెలుగు సినిమాలో రీఎంట్రీ ఇచ్చి మరోసారి తన నటనతో మెప్పించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ప్రస్తుతం ఈ