దేశంలో మరోసారి పోలియో వైరస్ కలకలం సృష్టించింది. పోలియో రహిత జాతీయ రాజధాని అయిన ఢిల్లీకి సమీపంలో ఉన్న ఘజియాబాద్‌లోని మురుగునీటి నమూనాల్లో వ్యాక్సిన్-డెరైవ్డ్ పోలియో వైరస్ (VDPV) టైప్ 1 కనుగొనబడింది. పోలియో వైరస్ నిర్ధారణ అయిన తర్వాత ఆరోగ్య శాఖ 12 ప్రమాదకర ప్రాంతాల్లో ఇంటింటి సర్వేను ప్రారంభించింది.ఈ ప్రాంతాల్లో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 150,000 మందికి పైగా పిల్లలను గుర్తించి, వారికి పోలియో టీకాలు ఎప్పుడు, ఎంత తరచుగా అందాయో, అలాగే వారు క్రమం తప్పకుండా టీకాలు వేయించుకున్నారా లేదా అసంపూర్తిగా వేయించుకున్నారా అనే విషయాలను నిర్ధారిస్తున్నారు.
అసలు వ్యాక్సిన్ డెరైవ్డ్ పోలియో వైరస్ అంటే ఏంటి, దీనికి భయపడాలా లేదా అనే విషయాల్ని డాక్టర్ సందీప్ ఎస్ రెడ్డి (ఇన్ఫెక్షియస్ డిసీజెస్ & ట్రావెల్ మెడిసిన్ కన్సల్టెంట్) వివరించారు.వ్యాక్సిన్-డెరైవ్డ్ పోలియో వైరస్ (VDPV) అంటే ఏంటి?పోలియో చుక్కల మందు (Oral Polio Vaccine - OPV)లో బలహీనపరిచిన బతికున్న వైరస్‌ను ఉపయోగిస్తారు. చాలా అరుదైన పరిస్థితుల్లో..
పిల్లల్లో వ్యాక్సినేషన్ (రోగనిరోధక శక్తి) తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ చాలా కాలం పాటు ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంటుంది. అలా తిరుగుతున్న క్రమంలో, అది జన్యుపరంగా మార్పులు చెంది, ప్రమాదకరమైన 'సర్క్యులేటింగ్ వ్యాక్సిన్-డెరైవ్డ్ పోలియో వైరస్' (cVDPV) గా మారుతుంది.
దీనికి తిరిగి పక్షవాతం కలిగించే శక్తి వస్తుంది.ప్రధాన కారణాలు తక్కువ వ్యాక్సినేషన్ శాతం: చాలా మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయించకపోవడం దీనికి ప్రధాన కారణం. పరిశుభ్రత లేకపోవడం: జనాలు ఎక్కువగా ఉండి, పారిశుద్ధ్య లోపం ఉన్న చోట్ల ఈ బలహీనమైన వైరస్ సులభంగా వ్యాపిస్తుంది.అసలు ఘజియాబాద్‌లో ఏం జరిగింది ?భారతదేశంలో పోలియోను పర్యవేక్షించడానికి 'ఎన్విరాన్మెంటల్ సర్వైలెన్స్' అంటే డ్రైనేజీ నీటి పరీక్షలు ఒక కీలకమైన భాగం.
ఈ వైరస్ ఆనవాళ్లు దొరికాయి. అయితే, దీనిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇదొక ముందస్తు హెచ్చరిక మాత్రమే.ప్రభుత్వ చర్యలుఆరోగ్య అధికారులు వెంటనే స్పందించి 12 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిఘాను తీవ్రం చేశారు. చిన్న పిల్లల వ్యాక్సినేషన్ స్థితిని తనిఖీ చేస్తున్నారు. ఎవరికైనా అకస్మాత్తుగా కాళ్లు, చేతులు పడిపోవడం వంటి లక్షణాలు ఉన్నాయో అని వెతుకున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చు.నివారణోపాయాలుదీనిని అరికట్టడం చాలా సులువు, ప్రభావంతమైంది. పిల్లలందరికీ పూర్తి స్థాయిలో పోలియో వ్యాక్సిన్లు వేయించడం. రెగ్యులర్ వ్యాక్సినేషన్‌తో పాటు, ప్రత్యేక పోలియో డ్రైవ్‌ల ద్వారా పిల్లలందరికీ చుక్కల మందు అందించడం. వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షితమైన పారిశుద్ధ్యం పాటించడం. పక్షవాతం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించడం.అసలు వైరస్ ఎలా బయటపడుతుంది?పోలియో చుక్కల మందు వేసుకున్న పిల్లల మలమూత్రాల ద్వారా వైరస్ మురుగునీటిలోకి చేరుతుంది. వ్యాక్సినేషన్ సరిగ్గా లేని ప్రాంతాల్లో ఈ మురుగునీటి ద్వారా వైరస్ ఇతరులకు సోకి, రూపాంతరం చెందుతుంది. అందుకే డ్రైనేజీ నీటిని (పరీక్షించడం ద్వారా వైరస్ ఉనికిని ముందే గుర్తిస్తారు.భయపడాలా? : లేదు. డ్రైనేజీలో వైరస్ దొరికినంత మాత్రాన అక్కడ పోలియో వ్యాధి తీవ్రంగా ఉందని అర్థం కాదు. సమాజంలో వైరస్ తిరుగుతోందని గ్రహించి, ముందే వ్యాక్సినేషన్ డ్రైవ్స్ చేపట్టడానికి ఇది ఉపయోగపడుతుంది.OPV vs IPV: ప్రస్తుతం ప్రభుత్వం ఓరల్ పోలియో చుక్కలతో (OPV) పాటు ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఐపివి (IPV - Inactivated Polio Vaccine) ని కూడా ఇస్తోంది. IPVలో చనిపోయిన వైరస్ ఉంటుంది కాబట్టి, దీని ద్వారా వ్యాక్సిన్-డెరైవ్డ్ పోలియో వచ్చే ప్రమాదం అస్సలు ఉండదు.చివరగా ఏం తెలుసుకోవాలి?భారతదేశానికి 2014లోనే పోలియో రహిత దేశంగా గుర్తింపు లభించింది. అయినప్పటికీ, మురుగునీటిలో పోలియో వైరస్ బయటపడటం అనేది ఒక హెచ్చరిక. పోలియోను పూర్తిగా నిర్మూలించాలంటే రెగ్యులర్ వ్యాక్సినేషన్, పర్యవేక్షణ, ప్రజల సహకారం ఎంతో అవసరం.సమయం తెలుగు సంప్రదించిన వైద్య నిపుణులుడాక్టర్ సందీప్ ఎస్ రెడ్డి,ఇన్ఫెక్షియస్ డిసీజెస్ & ట్రావెల్ మెడిసిన్ కన్సల్టెంట్.
ఇది ముందే హెచ్చరికల్ని ఇస్తుంది. ఇటీవల ఘజియాబాద్‌లోని దుందాహోరా మురుగునీటి శుద్ధి ప్లాంట్‌లో