
ధర తక్కువగా ఉండడమో లేదంటే వెంటనే అందుబాటులో ఉండడమో.. ఈ కారణాలతోనే వినియోగదారుడు ఏదైనా ఎంచుకుంటాడని అనుకుంటాం. కానీ బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఓ సంఘటన మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపించింది. ఓలా క్యాబ్‌లు సిద్ధంగా ఉన్నా..
ప్రయాణికులు మాత్రం అరగంటపాటు ఉబర్ కోసం వేచి ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. బెంగళూరుకు చెందిన ఆకాశ్ కొటాల్వార్ అనే వ్యక్తి తన లింక్డ్ఇన్ పోస్టులో ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నాడు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2లో దిగిన తర్వాత ఉబర్ గో సేవ కోసం దాదాపు 30 నుంచి 40 మంది ప్రయాణికులు క్యూలో నిలబడి ఉన్నారని తెలిపాడు.
అదే సమయంలో ఓలా కౌంటర్ వద్ద క్యాబ్‌లు సిద్ధంగా ఉన్నాయని, వెంటనే ప్రయాణం ప్రారంభించవచ్చని సిబ్బంది చెబుతున్నప్పటికీ ఎవరూ అక్కడికి వెళ్లలేదని పేర్కొన్నాడు. అయితే.. ఆకాశ్ కూడా ఉబర్ కోసం సుమారు 30 నిమిషాల నిరీక్షణ సమయం కనిపించిందని, అయినప్పటికీ ఓలాకు మారకుండా ఉబర్‌లోనే ఖరీదైన ‘ఉబర్ కంఫర్ట్’ సేవను ఎంచుకున్నానని ఆకాష్ తెలిపాడు.
తనలాగే క్యూలో ఉన్నవారిలో కూడా ఎవరూ ఓలాకు మారలేదని చెప్పాడు. కారణం ఏంటంటే.. ఇది బ్రాండ్ లాయల్టీ (బ్రాండ్‌పై అభిమానం) కంటే "స్విచింగ్ కాస్ట్" అనే మానసిక భావనకు ఉదాహరణ అని ఆకాష్ అభిప్రాయపడ్డాడు. కొత్త సేవకు మారితే ఏమవుతుందో తెలియని అనిశ్చితి, ఇప్పటికే అలవాటైన సేవను వదలాలనే ఇబ్బంది..
దీనినే 'స్విచింగ్ కాస్ట్'గా పిలుస్తారు. ఈ కేసులో.. జర్నీ కోసం మరో యాప్ డౌన్లోడ్ చేయడం, కొత్త సేవను ప్రయత్నించడం, అనిశ్చితిని ఎదుర్కోవడం కంటే ఇప్పటికే తెలిసిన సేవనే వినియోగదారులు ఎంచుకుంటారని వివరించాడు. అంటే.. ప్రజలు కేవలం తక్కువ ధర కోసం కాకుండా, "ఏం జరుగుతుందో ముందే తెలిసిన నమ్మకం" కోసం కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారన్నమాట.
Jun 19 2026 9:10 AM | Updated on Jun 19 2026 9:14 AM
ధర తక్కువగా ఉండడమో లేదంటే వెంటనే అందుబాటులో ఉండడమో.. ఈ కారణాలతోనే వినియోగదారుడు ఏదైనా ఎంచుకుంటాడని అనుకుంటాం. కానీ బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఓ సంఘటన మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపించింది. ఓలా క్యాబ్‌లు సిద్ధంగా ఉన్నా.. ప్రయాణికులు మాత్రం అరగంటపాటు ఉబర్ కోసం వేచి ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
బెంగళూరుకు చెందిన ఆకాశ్ కొటాల్వార్ అనే వ్యక్తి తన లింక్డ్ఇన్ పోస్టులో ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నాడు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2లో దిగిన తర్వాత ఉబర్ గో సేవ కోసం దాదాపు 30 నుంచి 40 మంది ప్రయాణికులు క్యూలో నిలబడి ఉన్నారని తెలిపాడు. అదే సమయంలో ఓలా కౌంటర్ వద్ద క్యాబ్‌లు సిద్ధంగా ఉన్నాయని, వెంటనే ప్రయాణం ప్రారంభించవచ్చని సిబ్బంది చెబుతున్నప్పటికీ ఎవరూ అక్కడికి వెళ్లలేదని పేర్కొన్నాడు. అయితే..
ఆకాశ్ కూడా ఉబర్ కోసం సుమారు 30 నిమిషాల నిరీక్షణ సమయం కనిపించిందని, అయినప్పటికీ ఓలాకు మారకుండా ఉబర్‌లోనే ఖరీదైన ‘ఉబర్ కంఫర్ట్’ సేవను ఎంచుకున్నానని ఆకాష్ తెలిపాడు. తనలాగే క్యూలో ఉన్నవారిలో కూడా ఎవరూ ఓలాకు మారలేదని చెప్పాడు.
కారణం ఏంటంటే.. ఇది బ్రాండ్ లాయల్టీ (బ్రాండ్‌పై అభిమానం) కంటే "స్విచింగ్ కాస్ట్" అనే మానసిక భావనకు ఉదాహరణ అని ఆకాష్ అభిప్రాయపడ్డాడు. కొత్త సేవకు మారితే ఏమవుతుందో తెలియని అనిశ్చితి, ఇప్పటికే అలవాటైన సేవను వదలాలనే ఇబ్బంది.. దీనినే 'స్విచింగ్ కాస్ట్'గా పిలుస్తారు. ఈ కేసులో.. జర్నీ కోసం మరో యాప్ డౌన్లోడ్ చేయడం, కొత్త సేవను ప్రయత్నించడం, అనిశ్చితిని ఎదుర్కోవడం కంటే ఇప్పటికే తెలిసిన సేవనే వినియోగదారులు ఎంచుకుంటారని వివరించాడు. అంటే.. ప్రజలు కేవలం తక్కువ ధర కోసం కాకుండా, "ఏం జరుగుతుందో ముందే తెలిసిన నమ్మకం" కోసం కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారన్నమాట.
ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఉబర్ సేవలు గతంలో మరింత స్థిరంగా, వినియోగదారులకు అనుకూలంగా ఉండటంతో ప్రజలు దానిని ఎక్కువగా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం వినియోగదారుల నిర్ణయం పరిస్థితిని బట్టి మారుతుందని, ధరలు, సౌలభ్యం, ప్రయాణ సమయం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు.
మొత్తంగా.. బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఒక విషయాన్ని స్పష్టం చేసింది. వినియోగదారుల ఛాయిస్ మన అంచనాలకు తగ్గట్లు ఉండదు. కొన్నిసార్లు నమ్మకం, అలవాటు, ముందస్తు అనుభవం కూడా వారి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఓలా క్యాబ్‌లు సిద్ధంగా ఉన్నా.. ఉబర్ కోసం ప్రయాణికులు క్యూలో నిలబడిన దృశ్యం ఇప్పుడు చర్చకు దారితీసింది.
డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు)
హైదరాబాద్ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
ఇక నా కొడుకు లేడయ్యా... సాయి కృష్ణ తల్లిని ఓదార్చిన YS జగన్
నా చావుకు CI నాగరాజే కారణం.. క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో
ఉద్యోగులకు కేంద్రం గిఫ్ట్.. క్షణాల్లో PF డబ్బులు విత్ డ్రా
రాజకీయాల కోసం కాదు ఆ తల్లి కన్నీరుని చూసి గుండెమండి.. అంబటి రాంబాబు ఎమోషనల్
ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఉబర్ సేవలు గతంలో