
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా- ఇరాన్ (USA- Iran) మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు జరగడంతో.. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ ఇరాన్ నౌకల రాకపోకలపై విధించిన దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేసింది.
ఈ మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఓ పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ ఓడరేవులు.. తీర ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని నౌకలపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేశాం. ఇరాన్ ఓడరేవులకు లేదా అక్కడి రాకపోకలకు అమెరికా దళాలు ఆటంకం కలిగించవు’ అని సెంటకామ్ పేర్కొంది.
దిగ్బంధనం ఎత్తివేసినప్పటికీ.. ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు అమెరికా యుద్ధనౌకలు దాని సమీపంలోనే మోహరించి ఉంటాయని స్పష్టంచేసింది. డీల్‌లోని అన్ని అంశాలను పాటిస్తూ.. వాటికి కట్టుబడి, అవి పూర్తిగా అమలవుతున్నాయని నిర్ధరించే వరకు తమ శక్తిమంతమైన యుద్ధనౌకలు ఈ ప్రాంతంలోనే ఉంటాయని పేర్కొంది.
60 రోజుల శాంతి ఒప్పందానికి సంబంధించిన ఎంవోయూపై ఇరుదేశాలు నిన్న సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. దీని అనంతరం హర్మూజ్‌లో చిక్కుకుపోయిన నౌకల ప్రయాణం కూడా ప్రారంభమైంది. దీంతో మరికొన్ని రోజుల్లో చమురు రవాణా సాధారణ స్థితికి రానుంది.
అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరికలు చేసింది. డీల్‌కు సంబంధించిన చర్చల నేపథ్యంలో అమెరికా దాని భాగస్వాములు దురుద్దేశంతో వ్యవహరించినా.. ఒప్పందాన్ని ఉల్లంఘించినా, మితిమీరిన డిమాండ్లు చేసినా తమ స్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. యుద్ధంలో ఇప్పటికే గట్టి దెబ్బ తిన్నారు. మళ్లీ అదే దారిలో నడిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి