
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Big Update For Telangana Rains: తెలంగాణలో నైరుతి క్రమంగా విస్తరిస్తోంది. దీంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 15 జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్.. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి.
ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. ఇక ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కనిపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే సూచనలు ఉన్నాయన్నారు. ఇక జూన్ 21 నుంచి 24 వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేటతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగవచ్చని అంచనా వేసింది.
మరో వైపు తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదని, ఆ తర్వాత మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల సెల్సియస్ మేర
తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.