ప్రేక్షకుల ముందుకు సరికొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్ అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ బుల్లితెర నటుడు 'ఈటీవీ' ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా పరిచయమవుతున్న చిత్రం " వెంకట్రామయ్య గారి తాలూకా ". దినేష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించారు.
సతీష్ ఆవాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం అన్ని నిర్మాణానంతర పనులను ముగించుకుని జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తోంది.* 'పెద్ది' కోసం 'గబ్బర్ సింగ్' త్యాగం.. రీ రిలీజ్ వాయిదా వేసిన బండ్ల గణేష్ ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కోమలి మాట్లాడుతూ..
ఫోక్ సింగర్‌గా చిత్రసీమలో ప్రయాణం మొదలుపెట్టిన తనకు, వెండితెరపై ఒక మంచి సినిమా నిర్మించాలనేది బలమైన ఆశయమని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్నో ఒడుదుడుకులను, సవాళ్లను ఎదుర్కొన్నానని, కంటినిండా నిద్రలేని రాత్రులను గడిపి ఎట్టకేలకు ఈ సినిమాను పూర్తి చేశానని ఆవేదనతో కూడిన ఆనందాన్ని పంచుకున్నారు.
కష్టాలను అధిగమించి సినిమాను జూలై విడుదలకు సిద్ధం చేశామని, ఈ ప్రయాణంలో మీడియా మద్దతు తమకు ఎంతో అవసరమని ఆమె ఆకాంక్షించారు.* ట్విట్టర్ టాక్: సమంత వన్ ఉమెన్ షో... 'మా ఇంటి బంగారం' ఎలా ఉందంటే..?చిత్ర దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ..
సినిమాను జూలైలో విడుదల చేస్తున్నామని, త్వరలోనే ఒక అధికారిక ప్రెస్ మీట్ ద్వారా విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. కథాంశం గురించి వివరిస్తూ.. ఇదొక పల్లెటూరి నేపథ్యంలో సాగే భావోద్వేగాల ప్రయాణమని చెప్పారు. ప్రస్తుత సమాజంలో మనుషుల మధ్య బంధాలు కేవలం డబ్బుతోనే ముడిపడిపోతున్నాయని, మానవీయ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్న తీరును ఇందులో చూపించామన్నారు.
తల్లిదండ్రులు తమ కడుపు కట్టుకుని నలుగురు పిల్లలను ఎంతో అల్లారుముద్దుగా పెంచినప్పటికీ, అదే పిల్లలు తల్లిదండ్రుల చివరి దశలో వారిని చూసుకోవడానికి వెనకాడుతున్న వైనాన్ని, తల్లిదండ్రుల గొప్పతనాన్ని కళ్లకు
కట్టేలా ఈ ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కించినట్లు వివరించారు. కుటుంబ సమేతంగా థియేటర్లలో కూర్చుని హాయిగా ఆనందించేలా తెరకెక్కించిన ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, సుధ టైటిల్ పాత్రలలో కనిపించనున్నారు. వీరితో పాటు కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతూ ముంజెటి, హాసిని, యామిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. చరణ్ అర్జున్ ఈ చిత్రానికి స్వరాలు అందించగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలను, బి. అనిల్ కుమార్ సినిమాటోగ్రఫీని నిర్వహించారు. సతీష్ ఆవాల కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.