
ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తోన్నారు. ఇందులో భాగంగా కోల్కతాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారితో సమావేశం అయ్యారు. ఈ చర్చల్లో రెండు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై ఇరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
పరిపాలనా సంస్కరణలు, పేదలకు సంక్షేమ పథకాలు చేరవేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, ఆర్థిక ప్రగతిని సాధించడం వంటి అంశాలపై ప్రధానంగా సుదీర్ఘంగా చర్చించారు.ఏపీ అమలు చేస్తున్న సరికొత్త పారిశ్రామిక, డిజిటల్ విధానాలను ఈ సందర్భంగా నారా లోకేష్ వివరించారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు అమలు చేస్తోన్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం గురించి చర్చించారు.
తక్కువ సమయంలోనే పారిశ్రామిక అనుమతులు ఇచ్చే వ్యవస్థ గురించి వివరించారు. అలాగే డిజిటల్ గవర్నెన్స్ ప్రాధాన్యతతో పాటు, రియల్ టైమ్ మానిటరింగ్, అర్హులకు సంక్షేమ పథకాలను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా పారదర్శకంగా నేరుగా అందించే విధానాలను కూడా తెలియజేశారు.ఏపీ, పశ్చిమ బెంగాల్ మధ్య విభిన్న రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఈ భేటీలో సానుకూల చర్చలు జరిగాయి.
మత్స్య పరిశ్రమ, ఎగుమతులు, సంస్కృతి, పర్యాటకం వంటి రంగాలలో ఇరు రాష్ట్రాలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని లోకేష్ పేర్కొన్నారు. ఈ రంగాల్లో పరస్పర సహకారాన్ని కోరారు. దీనివల్ల అటు బెంగాల్, ఇటు ఏపీకి ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.
ప్రాంతాల మధ్య సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడానికి పర్యాటక రంగాన్ని అనుసంధానించాలని ప్రతిపాదించారు.పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దశాబ్దాలుగా స్థిరపడిన వేలాది మంది తెలుగు వారితో పాటు పెద్ద సంఖ్యలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన భక్తులు నివసిస్తున్నారు. వారికి తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం మరింత సులభతరం చేసేందుకు కోల్కతా లేదా శివారు ప్రాంతాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణానికి సహకరించాలని ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రత్యేకంగా సువేందు అధికారిని విజ్ఞప్తి చేశారుటీటీడీ ఆలయాన్ని నిర్మించేందుకు అవసరమైన
ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తోన్నారు. ఇందులో భాగంగా కోల్‌కతాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారితో సమావేశం అయ్యారు. ఈ చర్చల్లో రెండు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై ఇరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పరిపాలనా సంస్కరణలు, పేదలకు సంక్షేమ పథకాలు చేరవేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, ఆర్థిక ప్రగతిని సాధించడం వంటి అంశాలపై ప్రధానంగా సుదీర్ఘంగా చర్చించారు.ఏపీ అమలు చేస్తున్న సరికొత్త పారిశ్రామిక, డిజిటల్ విధానాలను ఈ సందర్భంగా నారా లోకేష్ వివరించారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు అమలు చేస్తోన్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం గురించి చర్చించారు. తక్కువ సమయంలోనే పారిశ్రామిక అనుమతులు ఇచ్చే వ్యవస్థ గురించి వివరించారు. అలాగే డిజిటల్ గవర్నెన్స్ ప్రాధాన్యతతో పాటు, రియల్ టైమ్ మానిటరింగ్, అర్హులకు సంక్షేమ పథకాలను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా పారదర్శకంగా నేరుగా అందించే విధానాలను కూడా తెలియజేశారు.ఏపీ, పశ్చిమ బెంగాల్ మధ్య విభిన్న రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఈ భేటీలో సానుకూల చర్చలు జరిగాయి. మత్స్య పరిశ్రమ, ఎగుమతులు, సంస్కృతి, పర్యాటకం వంటి రంగాలలో ఇరు రాష్ట్రాలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని లోకేష్ పేర్కొన్నారు. ఈ రంగాల్లో పరస్పర సహకారాన్ని కోరారు. దీనివల్ల అటు బెంగాల్, ఇటు ఏపీకి ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. ప్రాంతాల మధ్య సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడానికి పర్యాటక రంగాన్ని అనుసంధానించాలని ప్రతిపాదించారు.పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దశాబ్దాలుగా స్థిరపడిన వేలాది మంది తెలుగు వారితో పాటు పెద్ద సంఖ్యలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన భక్తులు నివసిస్తున్నారు. వారికి తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం మరింత సులభతరం చేసేందుకు కోల్‌కతా లేదా శివారు ప్రాంతాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణానికి సహకరించాలని ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రత్యేకంగా సువేందు అధికారిని విజ్ఞప్తి చేశారుటీటీడీ ఆలయాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థల కేటాయించాలని కోరారు. పశ్చిమ బెంగాల్‌లో శ్రీవారి ఆలయం నిర్మించడం వల్ల రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఆధ్యాత్మిక సంబంధాలు మరింత పటిష్టమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి నారా లోకేష్ ఇరు రాష్ట్రాల భాగస్వామ్యంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని విభిన్న రాష్ట్రాలు సమన్వయంతో కలిసి పనిచేసినప్పుడే దేశం మరింత వేగంగా ప్రగతి సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు.