
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
IPL 2027 94 Matches: ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్ 'ఇండియన్ ప్రీమియర్ లీగ్' (ఐపీఎల్) రాబోయే 2027 సీజన్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక భారీ మెగా ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు 74 మ్యాచ్‌లతో సాగుతున్న ఈ టోర్నీని, మరింత గ్రాండ్‌గా మార్చడానికి మ్యాచ్‌ల సంఖ్యతో పాటు షెడ్యూల్లోనూ కీలక మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఐపీఎల్ సీజన్లో క్రికెట్ ప్రేమికులకు డబుల్ వినోదం అందనుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఫార్మాట్ ప్రకారం జరుగుతున్న 74 మ్యాచ్‌ల సంఖ్యను ఏకంగా 94కు పెంచాలని బీసీసీఐ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మ్యాచ్‌ల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో, షెడ్యూల్లో ఒకే రోజు రెండు మ్యాచ్‌లు జరిగే రోజుల సంఖ్య కూడా గణనీయంగా పెరగనుంది.
వేసవి తాపానికి బ్రేక్.. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లు మార్చి చివరి వారంలో ప్రారంభమై మే ఆఖరు వరకు జరుగుతాయి. అయితే ఏప్రిల్, మే నెలల్లో ఉండే తీవ్రమైన ఎండల కారణంగా దేశీ, విదేశీ ఆటగాళ్లు శారీరకంగా తీవ్రంగా అలసిపోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు 2027 సీజన్‌ను కాస్త ముందుగానే ప్రారంభించాలని బీసీసీఐ కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది.
ప్రతిపాదించిన షెడ్యూల్ ప్రకారం.. 2027లో రాబోయే 20వ ఐపీఎల్ సీజన్‌ను మార్చి 10, 2027 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే 94 మ్యాచ్‌లతో కూడిన ఈ టోర్నీని మే 15న ముగించేందుకు ప్రణాళిక చేస్తున్నారని సమాచారం. ఇలా షెడ్యూల్‌ను ముందుకు జరపడం వల్ల మే నెలలోని పీక్ ఎండల నుండి ఆటగాళ్లకు ఉపశమనం లభించడమే కాకుండా, ఆ తర్వాత జరిగే ఐసీసీ టోర్నమెంట్లకు సిద్ధమవడానికి తగినంత సమయం దొరుకుతుంది.
ఆర్సీబీ హ్యాట్రిక్ సాధిస్తుందా? 2025లో ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈ ఏడాది కూడా అదే ఫామ్‌ను కొనసాగించి 'బ్యాక్-టు-బ్యాక్' ట్రోఫీలను ముద్దాడింది. ఈ నేపథ్యంలో, రాబోయే చారిత్రాత్మక 20వ సీజన్లో ఆర్సీబీ 'హ్యాట్రిక్' కొడుతుందా.. లేక ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి మాజీ ఛాంపియన్లు పునరాగమనం చేస్తాయా అన్నది అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
మ్యాచ్‌ల సంఖ్య 94కు పెంచడం వల్ల ఆటగాళ్లపై పనిభారం పెరిగే అవకాశం ఉంది. దీన్ని బీసీసీఐ ఎలా బ్యాలెన్స్ చేస్తుందనేది చూడాలి. మరోవైపు వచ్చే సీజన్‌కు ముందు జరగబోయేది మెగా వేలమా లేక మినీ వేలమా అనే ఉత్కంఠ కూడా నెలకొంది. వీటన్నింటిపై రాబోయే కొన్ని నెలల్లో బీసీసీఐ నుండి అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.