కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా 'అమరన్' ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా..
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇన్నాళ్లూ 'D 55' అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తాజాగా టీజర్ లాంచ్ చేశారు.ధనుష్ 55వ సినిమాకి ‘ఓం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. టీజర్ లో ధనుష్ స్క్రీన్ ప్రెజెన్స్, లుక్ బాగున్నాయి. ధనుష్‌ను పూర్తి స్థాయి కమర్షియల్ మూవీలో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ టీజర్ చూస్తుంటే.. అది నిజం కాబోతున్నట్లు కనిపిస్తోంది. అతని పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందనేది శాంపిల్ గా చూపించారు. రాజ్ కుమార్ పెరియసామి గత చిత్రం ‘అమరన్’ కంటే పూర్తిగా భిన్నమైన కంటెంట్ తో రాబోతున్నట్లు హింట్ ఇచ్చారు. కానీ ఈసారి కూడా వాస్తవ సంఘటనల ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని అనిపిస్తోంది. ముఖ్యంగా ‘పుష్ప’ తరహాలో ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. టీజర్ లో తెలుగు మాటలు వినిపించడాన్ని బట్టి.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో జరిగే కథతో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్నట్లు అనిపిస్తోంది. సాయి అభ్యంకర్ బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.‘ఓం చాప్టర్ 1 - ఉదిరమ్: ది బ్లడ్ వూ’ అంటూ టైటిల్ కింద ట్యాగ్ లైన్ పెట్టడం చూస్తుంటే.. ఈ మూవీని రెండు మూడు భాగాలుగా తీసుకురానున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.