తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మాజీ గవర్నర్ ఆర్.ఎన్. రవి హయాంలో అధికారిక కార్యక్రమాల క్రమం విషయంలో జరిగిన వివాదాలను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆర్లేకర్ పునరావృతం చేస్తారేమోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్న తరుణంలో రాష్ట్ర గీతం 'తమిళ్ తాయ్ వాళ్తు'తో సమావేశాలను ప్రారంభించి సంప్రదాయాన్ని కొనసాగించారు.
అయితే, సంప్రదాయానికి భిన్నంగా ఆ వెంటనే జాతీయ గీతాన్ని ఆలపించారు. సాధారణంగా గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత మాత్రమే జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. దీంతో ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.అనంతరం గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ తన ప్రసంగం ప్రారంభించారు.
టీవీకే ప్రభుత్వ రోడ్ మ్యాప్‌ను గవర్నర్ చదివి వినిపించారు. జనగణనలో భాగంగా కులగణను పూర్తి చేయాలని, రాష్ట్రంలో సామాజిక న్యాయ సర్వే నిర్వహణకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ప్రకటించారు. సామాజిక న్యాయానికి అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం అవసరమని, జాతీయ కుల గణన పూర్తయిన తర్వాత దీనిని అమలు చేస్తామని ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు.గవర్నర్ ప్రసంగంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ఒక ప్రధాన అంశంగా నిలిచాయి.
కేంద్రం నుంచి పన్నుల వాటాలో తమిళనాడుకు దక్కాల్సిన న్యాయమైన వాటాను డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా, అవసరమైతే ఈ సమస్యపై సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు వీలుగా న్యాయ నిపుణులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, అలాగే తమిళనాడు పట్ల అనుసరిస్తున్న ఆర్థిక వివక్షను పత్రాలతో సహా వివరిస్తూ ఒక నివేదికను ప్రచురించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.అలాగే, ఎన్నికల్లో విజయ్ సాధించిన విజయాన్ని ఒక విప్లవాత్మక రాజకీయ ఘట్టంగా ప్రసంగంలో అభివర్ణించారు.
గవర్నర్ ప్రసంగం పునరుద్ఘాటించింది.తమిళనాడు భాషా విధానాన్ని పునరుద్ఘాటిస్తూ.. 1968లో మాజీ సీఎం సీఎన్ అన్నాదురై హయాం నుంచి అవలంభిస్తో్న ద్విభాషా విధానాన్నే ఇకముందు కూడా కొనసాగిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, ఈ ప్రసంగంలో నూతన జాతీయ విద్యా విధానం 2020పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాము 'NEP 2020'ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని ప్రభుత్వం తెలిపింది. త్రిభాషా విధానాన్ని అంగీకరిస్తేనే తప్ప, సమగ్ర శిక్షా అభియాన్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 3,458 కోట్ల నిధులను నిలిపివేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఇలాంటి విధానపరమైన నిబంధనలు ఏవీ విధించకుండానే ఆ నిధులను విడుదల చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం కొనసాగిస్తామని ప్రభుత్వం పేర్కొంది.అంతేకాకుండా, ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను రాష్ట్ర జాబితాకు మార్చాలనే తన డిమాండ్‌ను ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది. విద్యా రంగంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం రోజురోజుకూ పెరుగుతుండటం వల్లే నీట్, జాతీయ విద్యా విధానం, భాషా విధానం వంటి సమస్యలన్నీ తలెత్తుతున్నాయని వాదించింది.గవర్నర్ ప్రసంగంలో ఎక్కువ భాగం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైనే కేంద్రీకరించారు. ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రాన్నిప్రస్తావిస్తూ.. గత ఐదేళ్లలో తమిళనాడు అప్పులు దాదాపు రెట్టింపై రూ. 10 లక్షల కోట్లకు చేరాయని ప్రభుత్వం తెలిపింది. ఇది రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో 28.3 శాతానికి సమానమని, దీనివల్ల రాష్ట్రంలోని ప్రతి పౌరుడిపై లక్ష రూపాయలకు పైగా అప్పు భారం పడిందని పేర్కొంది.ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆర్థిక క్రమశిక్షణను పునరుద్ధరిస్తూనే తమ ఎన్నికల హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని టీవీకే ప్రభుత్వం స్పష్టం చేసింది. అవినీతిని అరికట్టేందుకు, ఆదాయం రెట్టింపునకు తీసుకుంటున్న చర్యలను ఈ ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందులో భాగంగా ఇటీవల మద్యం తయారీదారులపై అదనపు ప్రివిలేజ్ ఫీజును విధించామని, దీని ద్వారా ఏటా రూ. 1,000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.అక్రమ మైనింగ్, పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిబంధనలను మరింత కఠినతరం చేయడం, పక్కాగా అమలు చేయడం ద్వారా ఖనిజాల నుండి వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పేర్కొంది.
డబ్బు, అధికార బలాన్ని తట్టుకొని సాధించిన ఈ విజయాన్ని ఒక చారిత్రాత్మక ప్రజా తీర్పుగా పేర్కొన్నారు. పారదర్శక పాలన, సామాజిక న్యాయం, సంక్షేమ ఆధారిత పరిపాలన పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను