
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) తాజాగా స్పందించారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదని మరోసారి స్పష్టం చేశారు. స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయని, చమురు ధరలు తగ్గుతున్నాయని అన్నారు.
ఈ మేరకు తన ‘ట్రూత్ సోషల్’లో పోస్టులు పెట్టారు. ‘‘చమురు ప్రవహిస్తోంది, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదు, ప్రపంచం సురక్షితంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి, ఉపాధి అవకాశాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.
ధరలు తగ్గుతున్నాయి. మన దేశం మునుపటి కంటే బలంగా, సురక్షితంగా ఉంది’’ అని ట్రంప్ పోస్టు చేశారు. దీనికి కొన్ని గంటల ముందు సామాజిక మాధ్యమంలో ఇవే అంశాలను ప్రస్తావిస్తూ.. ఇరాన్ విషయంలో తాను కఠినంగా వ్యవహరించలేదని భావించే వాళ్లు స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిని తాకుతుండటాన్ని గమనించాలన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో డిస్ ప్లేల విప్లవానికి చైనా శ్రీకారం చుట్టింది
.