
ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ 13 ఏళ్లకే ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకుని క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. బిహార్‌కు చెందిన ఈ కుర్రాడు రాజస్థాన్ రాయల్స్ తరఫున గత రెండు సీజన్లలో పరుగుల వరద పారించి ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాడు.
ఈ ప్రదర్శనతో భారత టీ20 జట్టులోనూ చోటు సంపాదించుకున్నాడు. ఇప్పుడు అదే రాష్ట్రం నుంచి మరో టీనేజీ సంచలనం వెలుగులోకి వచ్చింది. అక్షర గుప్తా (Akshara Gupta) అనే అమ్మాయి ఓ మ్యాచ్‌లో 126 బంతుల్లోనే 242.86 స్ట్రైక్‌రేట్‌తో 306 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 34 బంతుల్లో సెంచరీ చేసింది. మొత్తం 55 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు బాది వార్తల్లో నిలిచింది. బిహార్ క్రికెట్ అసోసియేషన్ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీ టోర్నమెంట్లో అక్షర గుప్తా ఈ సంచలన ఇన్నింగ్స్ నమోదు చేసింది.
15 ఏళ్ల అక్షర తూర్పు చంపారన్ జిల్లా రక్సాల్ అనే పట్టణంలో పుట్టి పెరిగింది. 14 ఏళ్ల వయసులోనే అండర్-19 మహిళల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. బిహార్ తరఫున రెండేళ్ల వ్యవధిలో వరుసగా నాలుగు బీసీసీఐ మహిళా టోర్నమెంట్లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది.
సంచలన ఇన్నింగ్స్ ఆడిన అక్షరకు బిహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్షవర్ధన్ అభినందనలు తెలిపారు. బిహార్ మహిళా క్రికెటర్లు తమ ప్రదర్శనల ద్వారా రాష్ట్రానికి నిరంతరం కీర్తిని తెస్తున్నారని పేర్కొన్నారు. క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు బీసీఏ నిరంతరం కృషి చేస్తోందని, ఇలాంటి ఇన్నింగ్స్‌లు యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తాయన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు