దేశవ్యాప్తంగా మామిడి సీజన్ జోరుగా సాగుతున్న వేళ, జపాన్‌కు చెందిన మియాజాకి రకం మామిడిపై అందరి దృష్టి నిలిచింది. ఈ పండు ధర కిలో రూ. 2.5 లక్షల వరకు పలుకుతోందని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది. అయితే, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో క్షేత్రస్థాయిలో పరిశీలించగా, ఈ ప్రచారంలో వాస్తవం కంటే అతిశయోక్తే ఎక్కువగా ఉందని వెల్లడైంది.జపాన్‌లోని మియాజాకి ప్రాంతానికి చెందిన ఈ పండ్లను 'తాయో నో టమాగో' (సూర్యుడి గుడ్డు) అని కూడా పిలుస్తారు.
ముదురు ఎరుపు రంగు, పసుపు-నారింజ రంగు గుజ్జుతో ఇవి ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. జబల్పూర్కు చెందిన రైతు సంకల్ప్ సింగ్ పరిహార్ ఏడేళ్ల క్రితం రైలు ప్రయాణంలో అనుకోకుండా లభించిన మొక్కలతో వీటి సాగును ప్రారంభించారు. తన 15 ఎకరాల 'మహా కాల్ బాబా కీ బగియా' తోటలో కేవలం ఐదు చెట్లకు మాత్రమే ఈ మియాజాకి పండ్లు కాస్తున్నాయి.
ఏడాదికి సుమారు 15 నుంచి 20 కిలోల దిగుబడి వస్తుండగా, వీటిని కిలో రూ. 15,000 చొప్పున దేశీయంగా విక్రయిస్తున్నారు. సాధారణ రకాలతో పోలిస్తే ఈ ధర అత్యధికమే అయినప్పటికీ, లక్షల రూపాయల ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టమవుతోంది. ఈ పండ్లను ఒక విశిష్టమైన బహుమతిగా భావించి ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లోని సంపన్నులు కొనుగోలు చేస్తున్నారు.
పండ్ల విలువను దృష్టిలో ఉంచుకుని తోట వద్ద 18 కాపలా కుక్కలు, సీసీటీవీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.మరోవైపు, ఉద్యానవన శాఖ అధికారులు ఈ పండుపై భిన్నమైన అభిప్రాయాన్ని