
అణు నిరాయుధీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఉత్తర కొరియా మరోసారి స్పష్టం చేసింది. ఆ దేశ నేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి, అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా పేరున్న కిమ్ యో జోంగ్ గురువారం ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అణు నిరాయుధీకరణ అనేది ఎప్పటికీ జరగని పని అని, అణ్వాయుధాలు తమ దేశ 'ప్రధాన ప్రయోజనాల్లో' భాగమని ఆమె తేల్చిచెప్పారు.
ఈ విషయంలో వెనక్కి తగ్గడం అనేది దాటకూడని గీత అని ఆమె స్పష్టం చేశారు.పారిస్‌లో జరిగిన జీ7 దేశాల సదస్సులో, ఉత్తర కొరియాను పూర్తిగా అణు నిరాయుధీకరణ చేయాలని నాయకులు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా ఇది జరగాలని వారు కోరారు.
ఈ డిమాండ్‌పై కిమ్ యో జోంగ్ తీవ్రంగా స్పందించారు. అమెరికా, దాని మిత్రదేశాలు చేస్తున్న ఈ డిమాండ్ 'పాతకాలపుది' అని ఆమె విమర్శించారు. ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ ఈ వివరాలను ప్రచురించింది."అణు నిరాయుధీకరణ అనేది వెనక్కి తీసుకోలేని విధంగా ముగిసిపోయిన అజెండా.
అది ఎప్పటికీ సాకారం కాదు" అని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు. అణ్వాయుధాలు తమ సార్వభౌమాధికారాన్ని కాపాడే శక్తివంతమైన సాధనాలని, దేశ శాంతికి మూలస్తంభాలని ఆమె అన్నారు. "అణ్వస్త్ర దేశం యొక్క ప్రధాన ప్రయోజనాలకు హాని తలపెట్టాలని చూసేవారు, విపత్తును ఆహ్వానించినట్టే" అని ఆమె తీవ్రంగా హెచ్చరించారు.అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ నేతలు తమ సమావేశంలో ఉత్తర కొరియా