
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Niranjan parents emotional words after ap deputy cm pawan kalyan hanumakonda visit: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న వరంగల్ వెళ్లి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న నిరంజన్ ను పరామర్శించారు. బాలుడికి తిరుమల శ్రీవారి ప్రసాదం అందజేశారు. అంతేకాకుండా అతనితో చాలా సేపు ముచ్చటించి తానున్నానని భరోసా ఇచ్చారు. ఓజీ 2కి నువ్వె నా చీఫ్ గెస్ట్ అంటూ ప్రకటించారు. బాలుడితో సెల్ఫీలు దిగారు. అతని తల్లిదండ్రులకు క్యాంటిన్ పెట్టించాలని సూచించారు.
అంతే కాకుండా.. బాలుడికి కావాలన్న పూడుల్ బ్రీడ్ కుక్కపిల్లతో పాటు, ఐపాడ్ ను అడిగిన గంటలోనే తన కార్యకర్తలతో పంపించి సర్ ప్రైజ్ చేశారు. పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు, బండ్ల గణేష్ రూ. 5 లక్షలను అందజేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ బాలుడ్ని పరామర్శించి వెళ్లిన తర్వాత చాలా మంది పవన్ అభిమానులు, డాక్టర్లు తమకు ఫోన్ చేశారని బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
నిరంజన్ తల్లిదండ్రులైన పొనుగోటి రాంగోపాల్, మానస దంపతులు ఇద్దరు మీడియాలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తమ ఇంటికి వచ్చి నిరంజన్ ను ఓదార్చడం పట్ల చాలా భావొద్వేగంకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి ప్రసాదం తీసుకుని ఇంటిలోపలికివస్తుంటే తమ బాలుడికి,తమకు సాక్షాత్తు కొండగట్టు అంజన్న వచ్చినట్లు అన్పించందని చెప్పారు. అంతే కాకుండా ఆయన పక్కనుండి నిరంజన్ కు ధైర్యం చెప్పడం మొదలైనవి చూసి చాలా ఎమోషనల్ అయ్యామన్నారు.
Read more:Pawan Kalyan Meets Niranjan: అభిమాని నిరంజన్ కోరిక నెరవేర్చిన పవన్ కళ్యాణ్.. అండగా ఉంటానంటూ భరోసా..!
పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్లాక చాలా మంది ఆయన అభిమానులు, తమకు ఎవరోకూడా తెలియని వైద్యులు తమకు ఫోన్ లు చేసి నిరంజన్ కు తాము ఉచితంగా వైద్యం అందిస్తామని ముందుకు వచ్చారన్నారు. నిరంజన్‌కు అన్ని రకాల చికిత్సలు అందించి.. లేచి నిలబడి, నడిచేలా చేసి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లేలా చేస్తామని చెప్తున్నారని నిరంజన్ తల్లిదండ్రులు భావొద్వేగంకు గురయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం తమ అభిమాన నేత గొప్ప మనసుకు పొంగిపోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.