
Vaibhav Sooryavanshi : భారత క్రికెట్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడుస్తోంది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి తన అద్భుతమైన హిట్టింగ్ నైపుణ్యాలతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ కుర్రాడిని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఏకంగా టీమిండియా సీనియర్ టీ20 జట్టుకు ఎంపిక చేసింది.
ఇంత చిన్న వయసులోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతుండటంతో, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల నాటి రికార్డు ప్రమాదంలో పడింది. సచిన్ కంటే తక్కువ వయసులోనే వైభవ్ అంతర్జాతీయ మ్యాచ్ ఆడితే, అతడు చరిత్ర సృష్టించడం ఖాయం.
ఈ క్రమంలోనే చాలా మంది అతడిని సచిన్ టెండూల్కర్‌తో పోల్చడం మొదలుపెట్టారు. శ్రీకాంత్ ఇచ్చిన క్రేజీ సన్ ఆఫ్ గాడ్ టైటిల్ ఈ సచిన్ వర్సెస్ వైభవ్ వివాదంపై భారత మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికరంగా స్పందించారు.
వేర్వేరు కాలాలకు చెందిన ఆటగాళ్లను పోల్చడం కరెక్ట్ కాదని చెప్తూనే, వైభవ్‌ను ఆకాశానికెత్తేశారు. "దయచేసి సచిన్‌తో వైభవ్‌ను పోల్చకండి. సచిన్ క్రికెట్ ప్రపంచానికి దేవుడు (God of Cricket). ఆ దేవుడితో ఎవరూ సాటి రారు. కానీ ఈ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని చూస్తుంటే నాకు ఆ దేవుడి కొడుకు (Son of God)లాగా అనిపిస్తున్నాడు.
సచిన్ రేంజ్ వేరు, అతడి దగ్గరకు కూడా ఎవరూ వెళ్లలేరు. కాబట్టి ఈ పోలికలకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయండి" అని శ్రీకాంత్ న్యూస్ ఏజెన్సీ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వైభవ్ బ్యాటింగ్ లో ఉన్న ఆ అద్భుత మ్యాజిక్ ఏంటి?
66 ఏళ్ల కృష్ణమాచారి శ్రీకాంత్ విశ్లేషణ ప్రకారం.. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో, అండర్-19 క్రికెట్ లో సాధించిన రికార్డులు అసాధారణమైనవి. మైదానంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ షాట్లు ఆడే విధానం చూస్తే ముచ్చటేస్తుందని
ఆయన అన్నారు. వైభవ్ రిస్ట్ స్పీడ్, బ్యాట్ స్పీడ్, బ్యాట్ స్వింగ్ చాలా అద్భుతంగా ఉంటాయని కొనియాడారు. ఎంతటి భయంకరమైన బౌలర్ వచ్చినా క్రీజులో ఎంతో ప్రశాంతమైన మైండ్ సెట్‌తో నిలబడటం ఈ వండర్ కిడ్ కి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ అని శ్రీకాంత్ వివరించారు.
VIDEO | Former India captain Krishnamachari Srikkanth urges fans not to compare Vaibhav Sooryavanshi with Sachin Tendulkar, calling the teenager a "tremendous talent" and backing him to become a future match-winner for India if given time and encouragement.
— Press Trust of India (@PTI_News) June 18, 2026 గుజరాత్ టైటాన్స్‌పై ఆడిన ఆ క్లాస్ ఇన్నింగ్స్ ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌పై వైభవ్ ఆడిన ఇన్నింగ్స్‌ను శ్రీకాంత్ ప్రత్యేకంగా గుర్తుచేశారు. ఆ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విపరీతమైన ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఈ 15 ఏళ్ల కుర్రాడు క్రీజులో పాతుకుపోయి 96 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సాధారణంగా ఇన్నింగ్స్ మొదటి బంతి నుండే విరుచుకుపడే అలవాటు ఉన్న వైభవ్.. ఆ మ్యాచ్ లో మాత్రం జట్టు అవసరాల కోసం ఎంతో ఓపికగా ఆడి, సమయం చూసి క్లాస్ షాట్లతో రెచ్చిపోయాడు. రన్స్ చేయాలనే ఆకలి, బౌలర్లపై ఆధిపత్యం చలాయించాలనే కసి ఈ పిల్లాడిలో స్పష్టంగా కనిపిస్తోందని శ్రీకాంత్ ప్రశంసించారు.
వైభవ్ సూర్యవంశీకి భారత క్రికెట్లో చాలా ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉందని శ్రీకాంత్ జోస్యం చెప్పారు. అందుకే అతడిపై అనవసరమైన అంచనాలు మోపి, వేరే ఆటగాళ్లతో పోల్చి ఒత్తిడి పెంచవద్దని క్రికెట్ ఫ్యాన్స్‌కు, మీడియాకు సూచించారు. "వైభవ్‌ను ఎవరితోనూ పోల్చకండి. అతడిని తన లాగే ఉండనివ్వండి. ఎలాంటి ఒత్తిడి లేకుండా సహజంగా ఎదిగేలా, తనకు నచ్చినట్లు స్వేచ్ఛగా ఆడేలా మనం కేవలం ప్రోత్సహిస్తే చాలు. ఈ పిల్లాడు దేశానికి ఎన్నో గొప్ప విజయాలు అందిస్తాడు" అని శ్రీకాంత్ తన విశ్లేషణను ముగించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..