
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు జీవనాడిగా పేర్కొనే హర్మూజ్‌కు (Strait of Hormuz) మళ్లీ ఊపిరి పోసినట్లయ్యింది. ఆంక్షల నేపథ్యంలో కొంతకాలంగా అక్కడ వందలాది నౌకలు చిక్కుకుపోగా..
తాజాగా పరిస్థితులు కుదుటపడడంతో తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగించేందుకు ఆయా నౌకలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒప్పందం తక్షణమే అమల్లోకి రావడంతో కొన్ని నౌకలు ఇప్పటికే ఆ మార్గంలో బయలుదేరినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. నౌకల రాకపోకలను ట్రాకింగ్ చేసే వ్యవస్థ ‘విండ్‌వార్డ్’ ప్రకారం..
హర్మూజ్‌లో సుదీర్ఘ కాలంగా నిలిచిపోయిన నౌకల్లో కొన్ని గురువారం ఉదయమే తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. తొలుత చైనాతో సంబంధమున్న ఐదు నౌకలు కదలగా, యూరోపియన్ జెండాలున్న రెండు నౌకలు తర్వాత క్రమంలో వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఏడు నౌకలు కూడా గత వంద రోజులకుపైగా హర్మూజ్ సమీపంలో చిక్కుకుపోయినవేనని సమాచారం.
వీటితోపాటు మరికొన్ని నౌకలు కూడా లంగరు వేసిన ప్రదేశం నుంచి జలసంధి వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో హాంకాంగ్, జపాన్‌కు చెందిన భారీ నౌకలు ఉన్నట్లు తెలిసింది. కాల్పుల విరమణ ఒప్పందం, కీలకమైన చెక్‌పాయింట్ తెరవడం వంటి అంశాలపై విశ్వాసం పెరుగుతోందనడాన్ని తాజా పరిణామం సూచిస్తోందని నౌకల ట్రాకింగ్ వ్యవస్థలు అంచనా వేస్తున్నాయి.
అయితే, హర్మూజ్‌లో పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొనడం అనేది శాంతి ఒప్పందం అమలుపై ఇరుపక్షాల నిబద్ధతపైనే ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
విప్లవానికి చైనా శ్రీకారం చుట్టింది.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో డిస్ ప్లేల