
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటికే అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఇంగ్లాండ్‌తో సిరీస్‌కూ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సమయంలో తగిలిన గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదని వార్తలు వస్తున్నాయి.
అందుకు ఇంకా సమయం కావాలని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఐదు టీ20లు, మూడు వన్డేలు (England ODIs) ఆడేందుకు భారత్ జట్టు ఇంగ్లాండ్ వెళ్లనుంది. జులై 1 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఫార్మాట్లోకి పునరాగమనం చేయడానికి పాండ్య చేరువలో ఉన్న తరుణంలో ఈ ఎదురుదెబ్బ తగిలింది.
దీంతో సెలెక్టర్లు ఈ సిరీస్‌కు పాండ్యకు బదులుగా మరో ఆటగాడిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పేస్ బౌలింగ్ ఆల్-రౌండర్‌గా అతడి ఆట కారణంగా పాండ్య వైట్-బాల్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇటీవల జరిగిన పలు మ్యాచ్‌లకు అతడు తరచూ గైర్హాజరు అవుతుండడంతో భారత్‌కు ఇబ్బందికరంగా మారింది.
ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతనికి చీలమండ గాయం అయిన తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో పాండ్యను ఫిట్‌గా ఉంచాల్సిన అవసరం ఉందని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ఇటీవల పేర్కొన్నారు.
అతడిని తాము ఎప్పుడైనా గ్రౌండ్లోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. ఇదీ చదవండి: లియోనెల్ మెస్సిపై చర్యలు తీసుకోవాలి: అల్జీరియా ఫిర్యాదు గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
తావు లేదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి