
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను గాయాల ముప్పు వేధిస్తూనే ఉంది. తాజాగా తొడకండరాల గాయం కారణంగా అతను ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య వచ్చే నెలలో ఇంగ్లండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు దూరమయ్యాడు.
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో శిక్షణ పొందుతుండగా అతడి తొడకండరాలకు గాయమైంది. కోలుకోవడానికి అంచనా వేసిన దానికంటే ఎక్కువ సమయం పడుతుందని సమాచారం. దీంతో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగే టీ20 సిరీస్‌లతో పాటు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న ఆసియా క్రీడల జట్టులోనూ సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు.
2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతని వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడానికే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం హార్దిక్ బౌలింగ్ చేసేందుకు పూర్తిగా ఫిట్‌గా లేడని సమాచారం. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా హార్దిక్ ఆడటం లేదు.
మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ టూర్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది జూన్ 22న జరిగే అతని ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా తేలనుంది. ఐపీఎల్ ఫైనల్లో కండరాల నొప్పితో బాధ పడుతున్న కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉంటూనే వేగంగా కోలుకుంటున్నాడు.
అతడు కూడా అఫ్గాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. జూన్ 22న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృందం అతని ఫిట్నెస్ను పునఃసమీక్షించనుంది. ఆ పరీక్షలో పాస్ అయితేనే జూలైలో జరిగే ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు కోహ్లీ ఎంపికవుతాడు.
సీనియర్ ఆటగాళ్ల గాయాల బెడద గిల్ నేతృత్వంలోని యువ జట్టుకు సవాలుగా మారుతుంది. ఫిఫా ప్రపంచ కప్2026: మెస్సిపై ఫిఫాకు అల్జీరియా ఫిర్యాదు