
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4ను 2 కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయనుంది 54 గంటల వరకు బ్యాకప్ సామర్థ్యం ఉంటుందని అంచనా ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్, 52dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ OnePlus Nord Buds 4 Launch : వన్‌ప్లస్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 లాంచ్ తేదీ ఖరారైంది.
ఈ కొత్త ఇయర్‌బడ్స్‌ను కంపెనీ జూన్ 25న లాంచ్ చేయనుంది. ఈ ఇయర్‌బడ్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్‌పై కంపెనీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. లాంచ్ ముందు అనేక ఇతర ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. ఇందులో టైటానియం లేయర్ డ్రైవర్లు ఉంటాయని (OnePlus Nord Buds 4) అంచనా.
పంచి బాస్ క్లియర్ వోకల్స్‌ను అందించే అవకాశం ఉంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలను ఓసారి పరిశీలిద్దాం.. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 లాంచ్ తేదీ (అంచనా) : వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. ఈ కొత్త ఇయర్‌బడ్స్ జూన్ 25న లాంచ్ కానుంది.
ఈ కొత్త ఇయర్‌బడ్స్‌లో 52dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ ఉంది. ఈ కొత్త ఇయర్‌బడ్స్‌లో ఇదే స్పెషల్ అట్రాక్షన్. జర్నీ లేదా వర్క్ సమయంలో కూడా క్లియర్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇందులో 12mm టైటానియం-ప్లేటెడ్ డైనమిక్ డ్రైవర్లు ఉంటాయని అంచనా.
అయితే, నార్డ్ బడ్స్ 4 డిజైన్ కూడా వెల్లడించింది. Read Also : PhonePe Wallet : కొత్త రూల్స్.. మీకు ఫోన్‌పే నుంచి ఇలా మెసేజ్ వచ్చిందా? నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మీరే! ఈ ఇయర్‌బడ్స్ ఇన్-ఇయర్ డిజైన్‌తో వస్తుంది. సిలికాన్ టిప్స్‌తో వస్తుంది.
కంపెనీ స్టెమ్-స్టైల్ బాడీలో రూపొందించింది. ఛార్జింగ్ కేస్ రెక్టాంగులర్ కొత్త డిజైన్‌తో వస్తుంది. కేవలం 4.3 గ్రాముల బరువుతో తేలికగా ఉంటాయి. ఇందులో 3D స్పేషియల్ ఆడియో, గేమ్-నిర్దిష్ట సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కంపెనీ
నార్డ్ బడ్స్ 4ను ఆస్ట్రల్ టీల్, క్లాసిక్ స్టెల్లార్ బ్లాక్ అనే 2 కలర్ ఆప్షన్లలో రానుంది. ఛార్జింగ్ కేస్‌తో కలిపి 54 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. కేవలం 10 నిమిషాల్లో 11 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ధర ఎంత అనేది కంపెనీ రివీల్ చేయలేదు. వారం రోజుల్లో లాంచ్ కానుంది. అప్పుడే మరిన్ని ఫీచర్లు వెల్లడించే అవకాశం ఉంది.