
అప్పటివరకు దంచికొట్టిన టీ20లు.. వారానికే టెస్టు మ్యాచ్‌లోకి ఎంట్రీ.. ఆపై మరికొద్ది రోజులకే 50 ఓవర్ల క్రికెట్... సుమారుగా ఇరవై రోజుల వ్యవధిలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మూడు ఫార్మాట్లనూ ఆడిన వైనం.. ప్రతి ఫార్మాట్లోనూ ‘కెప్టెన్’ సెంచరీతో మెరవడం గమనార్హం.
మూడు వారాల్లో టీ20, టెస్టు, వన్డే మ్యాచుల్లో సెంచరీ చేసి ఔరా అనిపించాడు. గిల్ ఇన్నింగ్స్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా సర్ప్రైజ్ అయ్యారంటే.. అతడి ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ..
బ్యాటర్‌గా అద్భుత ప్రదర్శన చేయడం బాగుంది. ఒక జట్టుకు నాయకత్వం వహించడమనేది ఒక ఆటగాడిలోని సత్తాను బయటకు తీసుకొస్తుంది. అదృష్టవశాత్తూ గిల్‌లోని అత్యుత్తమ ప్రతిభను వెలికితీసింది. బాగా పరుగులు చేయలేనప్పుడు కెప్టెన్‌గా మంచి నిర్ణయాలు తీసుకోవడమూ కష్టంగా మారుతుంది.
అప్పుడు ఇటు ఆటగాడిగా.. అటు సారథిగా విమర్శలు తప్పవు. అదే, వ్యక్తిగతంగా మంచి ఆటతీరు ప్రదర్శిస్తే.. నిర్భయంగా నిర్ణయం తీసుకోగలరు - సునీల్ గావస్కర్ దాదాపు రెండు నెలలపాటు టీ20 క్రికెట్ ఆడిన తర్వాత టెస్టులను ఎదుర్కోవడం ఎంతటి క్రికెటర్‌కైనా కష్టమే.
అఫ్గాన్ మనకంటే కాస్త చిన్న జట్టు అయినా సరే.. తక్కువగా అంచనా వేయడానికి వీల్లేని పరిస్థితి. కానీ, శుభ్‌మన్ గిల్ మాత్రం అలవోకగా ట్రాన్స్ఫామ్ అయిపోయాడు. టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత.. వారం రోజులకే వన్డే సిరీస్‌లో భారత్ తలపడుతోంది.
ఇక్కడ టెస్టుల్లో ఆడినట్లు నెమ్మదిగా ఉండటం కుదరదు. అలాగని టీ20ల్లో మాదిరిగా దూకుడుగా ఆడలేం. రెండింటినీ మేళవించి మంచి ఇన్నింగ్స్ ఆడాలి. రెండో వన్డేలో గిల్ అదే చేసి చూపించాడు. మొన్నటి వరకూ అతడి ఫామ్, ఆటతీరుపై కాస్త సందేహపడిన వారికి ఇప్పుడీ ప్రదర్శనతో సమాధానం ఇచ్చినట్లైంది.
అఫ్గాన్‌తో వన్డే సిరీస్ అనంతరం టీమ్ఇండియా ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనుంది. ఆ రెండు సిరీస్‌లకూ గిల్ ఎంపిక కాలేదు. ప్రస్తుత ఆటతీరుతో అతడికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు
వచ్చినా ఆశ్చర్యపోనవసరంలేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.