
దాదాపు రెండు నిమిషాల 37 సెకన్ల నిడివి గల ట్రైలర్లో కథకు సంబంధించిన ప్రధాన అంశాలను ఆసక్తికరంగా చూపించారు. గత చిత్రంలోని సంఘటనల తర్వాత ప్రపంచం మొత్తం పీటర్ పార్కర్‌ను మరచిపోయిన పరిస్థితుల్లో కథ ప్రారంభమవుతుంది. తన అసలు గుర్తింపును రహస్యంగా ఉంచుకున్న పీటర్, కేవలం స్పైడర్‌మ్యాన్‌గా నగరాన్ని రక్షిస్తూ ఒంటరి జీవితాన్ని గడుపుతుంటాడు.
ఇంతలో నాలుగేళ్ల తర్వాత తిరిగి కాలేజ్ జీవితం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలని ప్రయత్నిస్తాడు. అదే సమయంలో నగరంలో వరుసగా జరుగుతున్న అనుమానాస్పద ఘటనలు అతడిని మళ్లీ యాక్షన్‌లోకి దిగేలా చేస్తాయి.పీటర్లో అతడే నియంత్రించలేని కొన్ని ఆశ్చర్యకరమైన శారీరక మార్పులు ప్రారంభమవుతాయి.
అంతేగాక నగరాన్ని భయపెడుతున్న, ఎవరూ చూడలేని ఒక కొత్త శక్తివంతమైన శత్రువు రంగప్రవేశం చేస్తాడు. తనలో జరుగుతున్న మార్పులతో పోరాడుతూ, తనకు ప్రియమైన వారిని రక్షించడానికి పీటర్ మరోసారి స్పైడర్‌మ్యాన్‌గా భారీ సవాల్‌ను ఎదుర్కొవాల్సి వస్తుంది.
అనుకోని కారణాలతో తన శక్తులు తగ్గిపోవడం, కనిపించని శత్రువుతో పోరాడాల్సిన పరిస్థితిలో పీటర్ ఆ దుష్ట శక్తులను ఎలా ఎదుర్కొన్నాడు? తన శక్తులను తిరిగి పొందగలిగాడా? నగరాన్ని ఎలా కాపాడాడు? అనే అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
తన పాత స్నేహితులు స్పైడర్ మ్యాన్‌ను గుర్తించగలిగారా లేదా అనే ఆసక్తి కర సన్నివేశాలతో సినిమా ఉత్కంఠగొలిపే సీన్లతో తెరకెక్కించారు. విజువల్స్, యాక్షన్ ఘట్టాలు సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రైలర్‌పై ఓ లుక్ వేయండి మరి
.