
'బాహుబలి'లో రాజమాత శివగామిగా పాన్-ఇండియా స్థాయిలో ఫేమస్ అయిన సీనియర్ నటి రమ్యకృష్ణ, ఇప్పుడు రియాలిటీ షో ప్రపంచంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. 'జియో హాట్‌స్టార్' ఓటీటీలో ప్రసారం కానున్న ఓ కొత్తరకం రొమాంటిక్ డేటింగ్ షోకు ఆమె హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు.
ఈ రియాలిటీ షోకు 'సెకండ్ లవ్' అని పేరు పెట్టారు. ప్రేమలో బ్రేకప్ అయిన 30 ఏళ్లలోపు 12 మంది సింగిల్స్‌ను (అబ్బాయిలు, అమ్మాయిలు) ఒక లగ్జరీ విల్లాలోకి పంపిస్తారు. అక్కడ వాళ్లు తమ రెండో ప్రేమను వెతుక్కోవడానికి ఈ షో అవకాశం కల్పిస్తుంది.
లవ్ లో బ్రేకప్ అయిన వాళ్లకి కొత్తగా రమ్యకృష్ణ పార్టనర్ ని సెట్ చేయబోతుందని చెప్పొచ్చు. ఈ వెరైటీ కాన్సెప్ట్ ఇప్పటి జెన్-జీ (Gen-Z) యూత్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ షోకు సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ పోస్టర్లో రమ్యకృష్ణ పగిలిన గుండె సింబల్‌ను అతికిస్తున్నట్లు పోజు ఇచ్చారు. ఆమెను చూస్తుంటే 90ల నాటి నటిలా కాకుండా, ఇప్పటి యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత గ్లామరస్‌గా, యంగ్‌గా ఉన్నారంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు
.