Kurnool TDP Activist Attacked : ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ.. క్షేత్రస్థాయిలో రాజకీయ కక్షలు, ప్రత్యర్థుల దాడుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల దౌర్జన్యాలు, రౌడీయిజం ఏమాత్రం తగ్గలేదనడానికి నిదర్శనంగా కర్నూలు నగరంలో ఒక భీతావహమైన ఘటన వెలుగుచూసింది.
ఓట్ల సవరణ ప్రక్రియలో అధికార పార్టీకి చెందిన అక్రమాలను నిలదీస్తున్నాడనే పాత కక్షలను మనసులో పెట్టుకుని.. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త తైజుం బాషాపై వైసీపీ మూకలు అర్ధరాత్రి వేళ ఘోర హత్యాయత్నానికి పాల్పడ్డాయి. కర్రలు, రాళ్లతో ఇష్టం వచ్చినట్లుగా దాడి చేయగా..
సదరు నేతకు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే రక్తస్రావం కూడా కాగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. మాటు వేసి విచక్షణారహితంగా దాడి..బాధితుడి కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్న తైజుం బాషా బుధవారం అర్ధరాత్రి సమయంలో తన నివాసం నుంచి సమీపంలో ఉన్న ఒక కిరాణా దుకాణానికి వస్తువులు కొనడానికి వెళ్లాడు.
దుకాణంలో సామాగ్రి తీసుకుని తిరిగి ఒంటరిగా ఇంటికి వస్తున్న క్రమంలో.. అప్పటికే చీకట్లో పొంచి ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడ్డారు. బాషా తప్పించుకునే లోపే నిందితులు తాము తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా కొట్టడం ప్రారంభించారు.
ఈ దారుణ దాడిలో బాషా తల, చేతులు, శరీరంపై పలుచోట్ల తీవ్రమైన లోతైన గాయాలు అయ్యాయి. ఘటనా స్థలంలోనే విపరీతంగా రక్తస్రావం కావడంతో బాషా స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు కలిసి వెంటనే తీవ్ర రక్తపు మడుగులో ఉన్న బాషాను కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)కి తరలించారు.
చేశారు. రాజకీయ కక్షల నేపథ్యంలో పక్కా ప్రణాళికతోనే ఈ హత్యాయత్నం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ దాడిలో వైసీపీకి చెందిన ముఖ్య అనుచరులు జలీల్, ఫైజల్, ఆరిఫ్లతో పాటు మరికొంత మంది అల్లరి మూకలు ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఫిర్యాదులో స్పష్టంగా వివరించారు. అలాగే ప్రస్తుతం నగరంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో వైకాపా నేతలు చేస్తున్న కొన్ని తప్పులను, అక్రమాలను బాషా పసిగట్టాడని.. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు. అయితే తాము చేస్తున్న ఓట్ల అక్రమాలకు టీడీపీ కార్యకర్త అడ్డుపడుతున్నాడనే అక్కసుతోనే.. ఈ ముగ్గురు నిందితులు అనుచరులను వేసుకుని దాడికి తెగబడ్డారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలోనూ ఇలాంటి రౌడీయిజం కొనసాగడం ప్రజాస్వామ్యానికి ముప్పని, నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తెదేపా నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
ప్రస్తుతం అత్యవసర విభాగంలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు..!ఈ కిరాతక ఉదంతంపై బాషా కుటుంబ సభ్యులు కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు