
హైదరాబాద్: రాయదుర్గంలోని సర్వే నెంబర్ 83/1లో భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. టీజీఐఐసీ భూముల వేలంపై 3 వారాలు స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఎస్బీఐ, టీజీఐఐసీ, గౌర వెంచర్స్‌కు నోటీసులు జారీ చేసింది. రాయదుర్గంలో టీజీఐఐసీ జరిపిన భూముల వేలంపై ఇటీవల ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది.
ఆ భూములు తమవేనంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం వేలంపై స్టే విధించింది. రాయదుర్గంలోని భూముల వేలంపై హైకోర్టు స్టే
|