బాలీవుడ్ సీనియర్ నటి అమృతా సింగ్, నటుడు సైఫ్ అలీ ఖాన్‌తో విడాకుల అనంతరం ఒంటరిగానే ఎందుకు ఉండిపోయారనే అంశం మరోసారి చర్చనీయాంశమైంది.
గతంలో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తన పిల్లల పెంపకం, వ్యక్తిగత స్వేచ్ఛతో తాను ఎంతో సంతృప్తిగా ఉన్నానని ఆమె ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.నటి పూజా బేడీ నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలో, పునర్వివాహం చేసుకునే ఆలోచన ఉందా అని అమృతను ప్రశ్నించగా.. ఆమె తనదైన శైలిలో సమాధానమిచ్చారు. "అవునని లేదా కాదనో సమాధానం చెప్పడానికి నేనేమీ 16 ఏళ్ల అమ్మాయిని కాదు. నిజానికి, ఒక పురుషుడు ఇవ్వగలిగేవన్నీ నాకు ఉన్నాయి. కేవలం కొన్ని అవసరాల కోసం మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు కనిపించడం లేదు" అని ఆమె కుండబద్దలు కొట్టారు.అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్ 1991లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు సంతానం. దాదాపు 13 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత 2004లో ఈ జంట విడాకులు తీసుకుంది. అనంతరం సైఫ్ 2012లో కరీనా కపూర్‌ను వివాహం చేసుకోగా, అమృత మాత్రం ఒంటరిగానే ఉంటూ తన పిల్లల బాధ్యతలను భుజాన వేసుకున్నారు.విడాకుల తర్వాత తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి కూడా అమృత ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రారంభంలో మానసికంగా కొంత కుంగిపోయినప్పటికీ, తన పిల్లల భవిష్యత్తు కోసం ధైర్యంగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. "పరిస్థితులకు