
ఒక్కోసారి అభిమానులు చేసే రచ్చ.. హీరోలను ఇరకాటంలో పెడుతుంటుంది. అభిమానుల అత్యుత్సాహం ఎలా కొంపముంచుతుందో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆ అత్యుత్సాహాన్ని ఇప్పుడు లారెన్స్ ఫేస్ చేస్తున్నారు. ఒక్కోసారి అభిమానులు చేసే రచ్చ.. హీరోలను ఇరకాటంలో పెడుతుంటుంది.
అభిమానుల అత్యుత్సాహం ఎలా కొంపముంచుతుందో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇలాంటి తలనొప్పులు తట్టుకోలేకే.. అప్పట్లో ‘నన్నెవరూ అభిమానించకండి.. మీ అమ్మనాన్నలను అభిమానించండి’ అంటూ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు.
అప్పటి నుంచి తనకసలు అభిమానులే లేరనేలా ఆయన ప్రవర్తిస్తుంటారు. సరే, ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence)ను ఓ అభిమాని వార్తల్లో నిలిచేలా చేసి, ఇరకాటంలో పెట్టేశాడు. నిజంగా ఆ అభిమాని ఏం చేశాడో తెలిస్తే అంతా షాకవుతారు.
ఇటీవల రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఎలా వార్తలు వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. ఆయనే స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చేంత వరకు వెళ్లింది అంటే.. త్వరలోనే ఆయన ఎంట్రీ ఉంటుందని అంతా ఫిక్సయ్యారు. లారెన్స్ మీటింగ్ పెట్టి..
సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తానని అలా చెప్పాడో లేదో.. ఓ అభిమాని.. ఏకంగా ఆయనని తమిళనాడుకు డిప్యూటీ సీఎంని చేసేశాడు. అవును, లారెన్స్ కుర్చీలో కూర్చుని ఉండగా, ఎదురు నేమ్ బోర్డు మీద ‘రాఘవ లారెన్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ - తమిళనాడు’ అని రాసి ఉన్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ ఫొటోని ఏఐలో చేసినప్పటికీ ఒరిజినలా! అనేలానే ఉండటం విశేషం. సీఎం విజయ్ (CM Vijay) రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి లారెన్స్ పోటీ చేయబోతున్నట్లుగా తమిళనాట వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఈ ఫొటో అక్కడి రాజకీయాలను మరింత వేడెక్కించింది.
ఈ పోస్ట్‌పై చర్చలు మొదలయ్యాయి. ఇదేంటి? అక్కడేం లేకుండానే లారెన్స్ ఇలా చేశాడంటూ విమర్శలు సైతం మొదలయ్యాయి. తీరా చూస్తే.. అది లారెన్స్ అకౌంట్ కాదని, ఆయన అభిమాని రన్ చేస్తున్న అకౌంట్ అని తెలిసే టైమ్‌కే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
లారెన్స్ ఫొటోపై స్వయంగా టీవీకే కార్యకర్తలే మండిపడటం స్టార్ట్ చేశారంటే.. విషయం ఎంత వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఆయన కామ్‌గా పార్టీలో జాయినై, ఖాళీ అయిన నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచిన తర్వాత, ఇలా ఫొటో వచ్చి ఉంటే ఏం ఉండేది కాదు కానీ, అసలక్కడ ఏం లేకుండా ఇలా ఫొటో బయటకు రావడంతో.. లారెన్స్‌పై విజయ్ ఫ్యాన్స్, పార్టీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. వారు అలా చేయడానికి కారణం లేకపోలేదు. ఆ ఫొటో పోస్ట్ అయిన అకౌంట్‌కు బ్లూ టిక్‌తో పాటు, 1.6 మిలియన్ ఫాలోయర్స్ ఉండటంతో.. నిజంగానే ఇది లారెన్స్ అఫీషియల్ అకౌంట్ అనుకుని అంతా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత లారెన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం తెలియాల్సి ఉంది. అందుకే అనేది.. అభిమానులతో జాగ్రత్తగా ఉండాలని. ఓ అభిమాని అత్యుత్సాహంతో.. లారెన్స్ రాజకీయ ఎంట్రీకి ఆదిలోనే బ్రేక్ పడినట్లయిందని, అంతటా మాట్లాడుకుంటున్నారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ రేర్ ఫీట్.. గ్లోబల్ రేంజ్ అంటే ఇది!
వెంకటేష్, విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు.. ఆ లీగ్ జరుగుతుందా?
వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి సినిమాకు క్లాప్ ఎవరు కొట్టారంటే
ఇది లారెన్స్ అఫీషియల్ అకౌంట్ నుంచి పోస్ట్ అయినట్లుగా ఉండటంతో.. ఒక్కసారిగా