
చిన్న అద్దం ముక్కను కూడా క్రియేటివ్‌గా హోమ్ డెకర్ ఐటమ్ చేయొచ్చు. ప్లాస్టిక్ స్పూన్లకు సిల్వర్ కలర్ పెయింట్ వేసి, అద్దం చుట్టూ అంటిస్తే సరి అందమైన అద్దం రెడీ. ప్లాస్టిక్ స్పూన్ల పైభాగం విరిచేసి గోల్డెన్ స్ప్రే పెయింట్ వేయండి.
దీర్ఘచతురస్రాకార గోల్డెన్ ఫ్రేమ్ తీసుకుని, దానిపై ఈ స్పూన్లను ఈ ఆకారంలో అతికిస్తే చాలు. అందమైన ఫోటో ఫ్రేమ్ రెడీ. ప్లాస్టిక్ స్పూన్లతో అందమైన నెమలిని తయారు చేయొచ్చు. కార్డ్‌బోర్డ్‌తో నెమలి ఆకారాన్ని కట్ చేయండి. దాని రెక్కల కోసం ప్లాస్టిక్ స్పూన్లకు గోల్డెన్ కలర్ వేసి, చుట్టూ అతికిస్తే చాలు.
ప్లాస్టిక్ స్పూన్లతో ఎస్తెటిక్ లుక్ ఇచ్చే అద్దం. రౌండ్ అద్దానికి చుట్టూ 4-5 వరుసల్లో స్పూన్లు అతికించండి. డార్క్ నుంచి లైట్ పింక్ షేడ్స్‌లో రంగు వేస్తే భలేగా ఉంటుంది. పిల్లలకు చదువుపై ఆసక్తి పెంచడానికి ఈ ఐడియా బాగుంటుంది.
ప్లాస్టిక్ స్పూన్లకు వేర్వేరు రంగులు వేయండి. వాటిపై కూరగాయల కటౌట్లను అతికించండి. ఇలా చేస్తే పిల్లలు సరదాగా నేర్చుకుంటారు. ప్లాస్టిక్ స్పూన్లకు గోల్డెన్ స్ప్రే పెయింట్ వేయండి. ఒక గుండ్రని గిన్నెకు వాటిని ఒకదాని తర్వాత ఒకటి అతికించండి.
ఇది ఒక ఫ్లవర్ పాట్ లాగా కనిపిస్తుంది. రకరకాల పువ్వులు పెట్టుకోవచ్చు. Gold Locket: తక్కువ బరువులో వచ్చే గోల్డ్ లాకెట్స్.. ఎంత బాగున్నాయో! Peanut Chutney: హోటల్ స్టైల్ లో పల్నీ చట్నీ ఇలా చేయండి.. అదిరిపోతుంది Stone Earrings: సాదా సీదా కాదు..
ఈ స్టోన్ ఇయర్ రింగ్స్ తో మెరిసిపోండి Fake Sindoor: ఇదొక్కటి చేస్తే చాలు..నకిలీ కుంకుమను ఈజీగా గుర్తించొచ్చు