
బంగ్లాదేశ్‌లో మత సామరస్యానికి విఘాతం కలిగించే పరిణామం చోటుచేసుకుంది. దేశంలోనే అత్యంత ఎత్తైనదిగా నిర్మిస్తున్న 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణ పనులను, ఇస్లామిక్ ఛాందసవాద గ్రూపుల నుంచి బెదిరింపులు రావడంతో తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, హిందూ మైనారిటీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగాయి. ఫలితంగా అక్కడ మైనారిటీల భద్రతపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి.ఉత్తర బంగ్లాదేశ్‌లోని గైబంధా జిల్లా, పలాశ్బరి ఉపజిల్లాలో ఉన్న శ్రీ శ్రీ రాధా గోవింద, కాళీ ఆలయ ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు.
ఆలయ కమిటీ సుమారు 220 మిలియన్ల టాకాల (దాదాపు రూ. 15.6 కోట్లు) వ్యయంతో ప్రైవేటుగా ఈ పనులు చేపట్టింది. ఇప్పటికే 80 శాతం నిర్మాణం పూర్తయింది. ఈ క్రమంలో, శుక్రవారం ప్రార్థనల అనంతరం కొన్ని రాడికల్ గ్రూపులు శ్రీరాముడి చిత్రపటాలపై బూట్లు విసురుతూ, నిర్మాణాన్ని బుల్డోజర్తో కూల్చివేస్తామని బెదిరించినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అయ్యాయి.ఈ బెదిరింపులతో భయాందోళనకు గురయ్యామని, అందుకే పనులు నిలిపివేసినట్లు ఆలయ అధ్యక్షుడు హరిదాస్ చంద్ర దాస్ తెలిపారు.
"మేము తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నాం. ప్రధాని తారిఖ్ రెహమాన్, అధికారులు మాకు రక్షణ కల్పించి, పనులు తిరిగి ప్రారంభించేలా చూడాలి" అని ఆయన విజ్ఞప్తి చేశారు. సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకే ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆలయ సలహాదారు శ్యామ్‌లాల్ కుమార్ మహంత వివరించారు.విగ్రహ నిర్మాణాన్ని నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఢాకా యూనివర్సిటీకి చెందిన హిందూ విద్యార్థులు జూన్ 16న కాగడాల ర్యాలీ నిర్వహించారు.
బెదిరింపులకు పాల్పడిన