
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Trigrahi Yog In Cancer 2026 Effect On Zodiac: జూన్ 22వ తేదిన ఒక ఖగోళ సంయోగం జరగబోతోంది. ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన త్రిగ్రహ యోగం ఏర్పడబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులవారు వృత్తితో పాటు వ్యాపారంలో గొప్ప పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా కొన్ని గ్రహాలు ఈ సమయంలో కలయిక జరపడం కారణంగా మోస్ట్ పవర్ఫుల్ త్రిగ్రహ యోగం ఏర్పడింది. ఈ యోగం జూన్ 22న కర్కాటక రాశిలో ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..
జూన్ 2న దేవదేవుడైన గురుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయగా.. జూన్ 8న ఐశ్వర్యానికి అధిపతి అయిన శుక్రుడు అదే రాశిలోకి సంచారం చేశాడు.. ఇదిలా ఉంటే జూన్ 22న బుధుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.. దీని ఫలితంగా.. మూడు ప్రధాన శుభ గ్రహాలైన బుధ, గురు, శుక్ర గ్రహాల కలయిక ఒకే రాశిలో జరగడం కారణంగా ఈ శక్తివంతమైన త్రిగ్రహ యోగం ఏర్పడబోతోంది.
ఈ శక్తివంతమైన యోగంతో నాలుగు రాశులవారి జీవితాల్లో గోల్డెడ్ డేస్ ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల పాటు, వ్యాపారాలు, వృత్తి పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో భారీగా పురోగతి కలుగుతుంది. కర్కాటక రాశి: మోస్ట్ పవర్ఫుల్ త్రిగ్రహ యోగంతో వ్యాపారాలు చేసేవారికి నిలిపోయిన పనులు కూడా తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి.
అంతేకాకుండా మార్కెటింగ్‌తో పాటు మీడియా, రచన
లేదా డిజిటల్ కంటెంట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా పని చేసే చోట గౌరవంతో పటు సామాజిక హోదా కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో సులభంగా పూర్తవుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో పెద్ద ఆర్థిక లాభాలతో పాటు ఈ సమయంలో తప్పకుండా ఇళ్లతో పాటు కార్లు కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారాలు చేస్తున్నవారికి బంపర్ లాభాలు కలుగుతాయి.
కన్యారాశి: మోస్ట్ పవర్ఫుల్ త్రిగ్రహ యోగం ఏర్పడడం వల్ల కన్యా రాశివారికి ఇది స్వర్ణయుగం కాబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పనికి తగ్గ ప్రశంసలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా అధికారుల నుంచి మంచి సపోర్ట్ కూడా లభించి.. కెరీర్ పరంగా చాలా బాగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ సమయంలో అనేక కొత్త ఆదాయ మార్గాలు లభించడమే కాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. గతంలో పెట్టి పెట్టుబడుల నుంచి ఊహించని స్థాయిలో ఆర్థిక లాభాలు కూడా పొందుతారు.
మీన రాశి: మోస్ట్ పవర్ఫుల్ త్రిగ్రాహి యోగం ఎఫెక్ట్‌తో మీన రాశివారికి ఈ సమయంలో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. అలాగే వీరు తప్పకుండా సానుకూలమైన ప్రభావంతో ముందుకు సాగుతారు. దీంతో ఉద్యోగాలు చేసేవారికి పని ప్రదేశాల్లో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. అంతేకాకుండా కొత్త బాధ్యతలతో పాటు పదవులు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు ఈ సమయంలో మంచి ప్రదేశాలకు ఉద్యోగ బదిలీలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. జీవితంలో శాంతి కూడా విపరీతంగా నెలకొంటుంది. మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి.
వృషభ రాశి: ఈ శక్తివంతమైన త్రిగ్రహ యోగం ఎఫెక్ట్‌తో వృషభ రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అద్బుతమైన ఫలితాలు కలుగుతాయి. వీరికి పనుల్లో విజయాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ధైర్యం, బలంతో పాటు నిర్ణయం తీసుకునే సామర్థ్యం విపరీతంగా పెరుగుతాయి. బుధ గ్రహ ప్రభావంతో ఉద్యోగాల పరంగా అద్భుతమైన పదోన్నతులు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. ముఖ్యంగా మార్కెట్‌తో పాటు మీడియా, రచన రంగాల్లో పనులు చేస్తున్నవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో భారీ మొత్తంలో ప్రజెక్ట్లు కూడా సొంతం చేసుకునే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.