
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Big pythons spotted on ac unit video viral: సాధారణంగా ఇతర సీజన్లలో కంటే వానాకాలంలో కోబ్రాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వరద నీళ్లతో పాటు అడవుల నుంచి కొండ చిలువలు ఎక్కువగా జనావాసాల్లోకి కొట్టుకుని వస్తాయి. రాత్రి పూట కొండ చిలువకు ఎక్కువగా అడవుల్లో సంచరిస్తాయి.
కొండ చిలువలు చాలా డెంజర్ గా ఉంటాయి. అవి 30 కేజీల నుంచి 40 కేజీల వరకు బరువు ఉంటాయి. ఇవి తమ వేట మీద దాడులు చేసి అమాంతం వాటిని చుట్టుకుంటాయి. ఆ తర్వాత ఊరిరాడకుండా చేసి చంపేస్తాయి. ఇలాంటి ఘటనలు తరచుగా మనం చూస్తాం. అందుకే కొండ చిలువలతో జాగ్రత్తగా ఉండాలని చెప్తారు.
ఈ నేపథ్యంలో కొండచిలువ ఇంటి చుట్టు దట్టమైన చెట్లు, పనికి రాని వస్తువులు పడేయడం వల్ల దానిలో నక్కి దాక్కుంటాయి. ఈ నేపథ్యంలో భారీ కొండ చిలువలు రెండు ఏకంగా కిచెన్ లోకి ప్రవేశించాయి. అంతేకాకుండా అవి రెండు కూడా ఏసీ యూనిట్ మీద ఎక్కి చుట్టుకుని కూర్చున్నాయి.
దీన్ని ఆ ఇంట్లోని వ్యక్తి గుర్తించడంతో పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డారు. వైరల్ అవుతున్న వీడియోలో రెండు భారీ కొండ చిలువలు ఏసీ యూనిట్ మీద ఎక్కి చుట్టుకుని కూర్చున్నాయి. మరీ దాన్ని ఇంట్లో వారు గమనించడంతో అవి రెండు కూడా దాడికి దిగాయి.
అక్కడ చుట్టుపక్కల అడవులు ఉన్నాయో లేదా చుట్టుపక్కల చెట్లు ఉన్నాయో కానీ భారీ కొండ చిలువలు సమీపంలోని ఇంట్లోకి ప్రవేశించాయి. మరీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అంత
పెద్ద కొండ చిలువలు ఏసీ యూనిట్ ఎక్కేవరకు ఇంట్లో వారు ఏంచేస్తున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా చెప్పుకొవచ్చు. మరో విషయం ఏంటంటే.. ఇటివల వైరల్ అవుతున్న వీడియోలలో ఏఐ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
Read more: Cobra video: ఇదేందిరా సామీ.. స్కూటీ ఎక్కి కోపంతో బుసలు కొడుతున్న నాగు పాము.. వీడియో వైరల్...
దీంతో ఏవి నిజమైనవో, లేదా ఏవి ఏఐ వీడియోలో కూడా తెలుసుకొవడం కొంచెం రిస్క్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన వాదనలు విన్పిస్తున్నారు. అసలు ఇది నిజమైనదా అని కొంత మంది కామెంట్స్ చేస్తుండగా మరికొంత మంది మాత్రం కొండ చిలువల దాడి చూస్తుంటే బాబోయ్ భయమేస్తుందని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.