
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Tgsrtc Free Bus Travel Latest News: వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ కోసం నీట్ (NEET) పరీక్ష రాసే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అందించింది.
జూన్ 21వ తేదీన జరగబోతున్న నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ..
విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. హాల్ టికెట్ చూపిస్తే చాలు.. ఫ్రీ జర్నీ.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు.. జూన్ 21న పరీక్ష రాయబోయే విద్యార్థులు తమ వెంట నీట్ హాల్ టికెట్ ఉంచుకుంటే సరిపోతుంది.
బస్సు ఎక్కేటప్పుడు కండక్టర్‌కు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే.. పరీక్షా కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారిక ప్రకటనలో భాగంగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లోని పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఆర్థిక భారం తప్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..
ఆర్టీసీ MDకి మంత్రి కీలక ఆదేశాలు.. ఈ ఉచిత ప్రయాణ నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆర్టీసీ ఎండీకి స్పష్టమైన ఆదేశాలు అధికారికంగా జారీ చేశారు. పరీక్ష రోజున విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉండే
అవకాశం ఉంటుంది కాబట్టి.. పరీక్షా కేంద్రాల మార్గాల్లో ప్రత్యేక బస్సులను నడపాలని సూచించారు. ఏ ఒక్క విద్యార్థి కూడా రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడకూడదని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
సర్కార్ సానుకూల స్పందన.. ఇటీవల దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు సంబంధించి జరిగిన పరిణామాల నేపథ్యంలో రీ-ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో గ్రామీణ విద్యార్థులపై ప్రయాణ ఖర్చుల భారం పడకుండా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ఎన్ఎస్యూఐ (NSUI) సహా పలు విద్యార్థి సంఘాలు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.