
Annamalai : తమిళనాడులో సినిమా హీరో విజయ్ ముఖ్యమంత్రిగా ఎన్ని కల్లో గెల్చి ఒక చరిత్రనే సృష్టిం చాడు. ఎన్నో ఏళ్ళ అనుభవంతో పాతుకొని పోయిన పార్టీలు డి. యం. కె. ఏఐడియంకె, వాటితోపాటు నామ మాత్రంగా మిగిలివున్న కాంగ్రెస్‌పార్టీ, ఏదో విధంగా తమిళనాడును వశ పర్చుకోవాలని వ్యూహంతో కొన్నేళ్ల నుంచి కాపేసివున్న బి.జె.పి.
అన్నీ విజయ్ గెలుపు ముందు తలవొంచక తప్పలేదు. అయితే సంపూర్ణ విజయానికి అడుగు దూరం లో వున్న విజయ్ పార్టీకి సీట్లు తక్కువయినప్పుడు వ్యూహం రచించి సరిపడా చిన్నాచితకా పార్టీలను దగ్గరకు చేర్చి సి.యం కుర్చీని విజయ్‌కు వచ్చేట్లు చేయటం జరిగింది.
బెల్లం చుట్టూ చీమలు చేరినట్లు అధికారం వున్న విజయ్ చుట్టూ ఎ.ఐ.ఎ.డి.యంకె పార్టీలోని కొందరు ఎం.ఎల్.ఏ లు విజయ్ టి.వి.కె. పార్టీలోకి క్యూ కటున్నా, అతను ప్రలోభాలు పెట్టకుండా ఎక్కువ ఓటర్లను వశపర్చుకున్నా, ఎన్ని కలు ముందు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు స్త్రీలకు, విద్యా ర్థులకు, యువతకు, వృద్ధులకు సమకూరుస్తానని మాట యిచ్చారు!
నిజానికి యితర పార్టీలు అన్ని రాష్ట్రాలలో ఎడా పెడా యిస్తున్న హామీల్లాంటివే! అవి ఏవిధంగా నెరవేర్చ గులుగుతాడని, ఆర్థిక నిపుణులు అప్పుడే పెదవి విరవటం మొదలు పెట్టారు! ప్రీ బీస్ గా రాజకీయ రంగంలో ప్రసిద్ధి గాంచిన ఈ ఉచితాలు ఇవ్వటం సాధ్యమా అన్నది కొత్తగా ఎన్నికయిన విజయ్ కూడా ఆలోచించినట్లు లేదు!
ఇప్పుడు ప్రభుత్వ ఖజానాలో తగిన డబ్బులేదు. నిజానికి దాదాపు ఏమీ లేదు అన్న ధోరణిలో మాట్లాడుతున్న ఆ పార్టీ నాయ కులే కాదు అతని శ్రేయోభిలాషులు కూడా తలలు పట్టుకొని కూర్చున్నారు. డి.ఎం.కే. నాయకుడు స్టాలిన్ ఆరు నెలల దాకా విమర్శలు కొత్త ప్రభుత్వం మీద చేయనన్నాడు గానీ, మిగతా పార్టీలు కొన్ని తలోరాయి విసురుతుంటే, నియం త్రించుకోలేక, స్టాలిన్ కూడా ఆరు నెలల మాట మరిచిపోయి విమర్శలు ఘాటుగానే కొత్త ప్రభుత్వం మీద మొదలుపెట్టాడు.
Also : Uddhav Thackeray : ఉద్ధవ్ సేనలో మరోసారి భారీ చీలిక: ఢిల్లీ సమావేశానికి ఆరుగురు లోక్‌సభ ఎంపీలు గైర్హాజరు!
రాజకీయ నాయకులు సంక్షేమ పథకాల విషయంలో అధికారంలో వున్నప్పుటి మాట తీసి గట్టుమీద పెట్టినప్పుడే పెద్దగా పట్టించుకోని ప్రజలు స్టాలిన్ విమర్శల విషయంలో మాట తప్పుతే దాన్ని తప్పుపట్టారా? అయితే ఈ విషయం అటుంచుతే ప్రజల్లో ముఖ్యంగా ఓటర్లకు అర్థ మైన విషయం ఏమిటంటే ఉచితాల హామీలు ఎప్పటికీ నెర వేరేవి కావు అని! విజయ్ ఎన్నికల సందర్భంగా కొంత నిజయితీతో వ్యవహరించటం వల్ల అతని పట్ల మొగ్గు చూపారు! హామీలు నెర వేర్చటం అందు లో అన్ని హామీ లను తు.చ. తప్పకుండా అమలు చేయటం అలవికాని పని! ఈ సంద ర్భంగా ఇతర పార్టీల్లో వుండి కొంత అనుభవం గడిం చిన తర్వాత బయటకు వచ్చి ఈ మధ్యనే కొత్తగా పార్టీలు పెట్టిన నాయకులు సైతం ఇలాంటి ఉచితాల హామీలు నెరవేర్చటం ఎవరికీ సాధ్యం కాదు అని ఓటర్లకు నచ్చచెప్పి నిజాయితీగా రాజకీయాలు చేయటానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఏర్పడింది! దానిని సద్విని యోగపర్చుకున్న నాయకులే ముందు తరాల వారికి మార్గ దర్శకులవుతారు! రాజకీయాల్లో నిజాయితీని ప్రదర్శించటమే కాకుండా పారదర్శకంగా వ్యవ హరించిన వారు అవుతారు! కొత్తగా పార్టీలు పెట్టినవారిలో తమిళనాడుకు చెందిన అన్నా మలైని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి!అతను ఐ.పి.యస్ ఆఫీసర్‌గా కర్ణాటక రాష్ట్రం లో ఎనిమిదేళ్ళు పనిచేసి సమా జానికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో ఉన్నతమైన ఉద్యో గాన్ని వదిలి బయటకు వచ్చి ప్రజల్లో మమేకమైనవాడు. బి.జె.పి అధ్యక్షుడిగా తమిళ నాడులో వున్నప్పుడే అతని ప్రతిభా పాటవాలు బయటకు వచ్చాయి! అయితే కాంగ్రెసు మాదిరే మారిపోతున్న బి.జె.పీ పార్టీ సాంప్రదాయ పద్ధతు లనే అవ లంభించి ఎ.ఐ.ఎ.డి. యం.కే పార్టీలో చీలికతెచ్చి తమిళ నాడును పోయిన ఎన్నికల్లో హస్తగతం చేసుకోవా లని పగటి కలలుకన్నది. కానీ విలువైన అన్నామలైని వదిలేసి సాంప్రదాయ రాజకీయాలకే పెద్దపీట వేయటంతో, అన్నామలై ఆ పార్టీని వదిలేసి ‘వుయి ది లీడర్స్’ అన్న కొత్త ఉద్యమపార్టీని స్థాపించి తమిళనాడులో కొత్తశకానికి నాందీ పలికిన విజయ్ తర్వాత మరొకడిగా గుర్తించబడుతున్నారు.
1.3 మిలియన్ల మంది పార్టీ పెట్టిన వెంటనే అతనితో రాజకీయాల్లో వుండ టానికి సిద్ధం కావటం విశేషంగా చెప్పు కోవాలి! క్షేత్రస్థాయి నాయకత్వం ఆర్గానిక్ వ్యవసాయం క్రీడా భివృద్ధి బలోపేతం చేయటం, ఒక ఉద్యమంగా తీర్చిదిద్దా లని ఆశిస్తున్నాడు. ‘కలాం స్కూల్ ఆఫ్ ఐడి యాలజీ’ని స్ఫూర్తితో స్వచ్ఛమైన, సామాన్యుడు పాల్గొనే రాజకీయ ఒరవడిని తీర్చిదిద్దాలని అతని ఆలోచన! ద్రావిడ, సాంప్రదా య వాదాలకు తిలోదకాలివ్వటం అతని లక్ష్యంగా కనపడుతున్నది. ఎపిజె అబ్దుల్ కలాం సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ పాలిటిక్నిక్స్ కోయంబత్తూర్‌లో స్థాపించి ట్రయినింగ్ యువత కు యిచ్చి నిజమైన రాజకీయనాయకులను తయారు చేయా లని అతని ఆకాంక్ష! వచ్చే సివిక్ అసెంబ్లీ ఎన్నికలతో రాజ కీయ ప్రస్థా నం ప్రారంభించాలని అతని సంకల్పం! ఎన్నికల సందర్భంగా ఉచితాలప్రసక్తి తేకుండా కేవలం విద్య, వైద్యం తోపాటు ఆహారం కొంతమేర ఇళ్ళ సౌకర్యంలాంటి సంక్షేమ పథకాలు ఆచరించి మిగతా ఉచితాలను దూరంగావుంచి ప్రజాశ్రేయస్సు నిజమైన ప్రజాస్వామ్యంలో సాధించగలు గుతే అన్నామలై రాజకీయాల్లో అందరికంటే మిన్నగా రాణిం చగలరు. మూస పోసిన రాజకీయ ఒరవడితో ముందుకు వెళ్తే, ‘ఎందరో వున్నారు! అందరికీ వందనాలు చెప్తున్నాం కదా!’ అంటారు ప్రజలు ఉచితాలు ప్రస్తుతం అనుచితాలు గా మారాయి! అన్నామలై ఓపికగా ఎదురు చూడటంతో పాటు సామాన్యు డికి విలువలతో కూడిన జీవితాన్ని అందించాలన్న లక్ష్యంతో అబ్దుల్‌కాలం’ స్ఫూర్తితో ముందుకు నడుస్తే అంతకంటే కావల్సింది ఏముంది?
Kaudipally news: కౌడిపల్లిలో ఆకస్మిక తనిఖీలు!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Elon Musk : ‘కాక్రోచ్’ల అపర సృష్టి మస్క్ దేనా?
Private education : సామాన్యుడికి భారంగా ప్రైవేట్ చదువు!
Cattle’s hunger : పశువుల ఆకలిని తీర్చాల్సిన బాధ్యత ఎవరిది?
Read