
Land values : రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూములు, స్థలాలు, నివాస వాణిజ్య ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన విలువలు అమల్లోకి రావడంతో రియల్ ఎస్టేట్ రంగం, భూ యజమానులు, కొనుగోలుదారులు, నిర్మాణ రంగం, ప్రభుత్వ ఆదాయ వ్యవస్థపై విస్తృత ప్రభా వం పడనుంది.
ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి మార్కెట్ పరిస్థితులను పరిశీలించి ఆస్తుల విలువలను సవరించడం సాధారణ పరిపాలనా ప్రక్రియే అయినప్ప టికీ, ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, దాని ప్రయో జనాలు, ప్రజలపై పడే భారం వంటి అంశాలు చర్చనీయాం శంగా మారాయి. భూమి అనేది పరిమిత సహజ వనరు.
జనాభా పెరుగుదల, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కారణాల వల్ల భూమికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాలు, జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, కొత్త అభివృద్ధి కేంద్రాల పరిసర పాంతాల్లో భూముల ధర లు గణనీయంగా పెరుగుతున్నాయి.
అయితే వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలకు మధ్య చాలా సందర్భాల్లో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యా సం కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గడమే కాకుండా, లావాదేవీలలో పారదర్శకత కూడా దెబ్బతింటుంది. అందుకే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విలువలను సవరించడం అవసరమవుతుంది.
Read Also : Adulterated Ghee : భారీ కల్తీ నెయ్యి దందా .. అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్ల నెయ్యి స్వాధీనం! సబ్జిస్ట్రార్ కార్యాలయాల్లో అమలయ్యే మార్కెట్విలువలనుప్రభుత్వం ప్రధానంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల లెక్కింపు నకు ప్రామాణికంగా ఉపయోగిస్తుంది.
మార్కెట్లో ఒక ఎకరం భూమి విలువ కోటి రూపాయలు ఉంటే, ప్రభుత్వ రికార్డుల్లో అది చాలా తక్కువగా నమోదై ఉంటే ఆదాయ నష్టం జరుగుతుంది. అందువల్ల వాస్తవ పరిస్థితులకు దగ్గ రగా విలువలను తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం
ఈ సవరణలు చేపడుతుంది. రాష్ట్ర ఆదాయ వనరుల్లో రిజిస్ట్రే షన్ శాఖకు కీలకస్థానం ఉంది. సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రభుత్వ వ్యయాలను నిర్వహిం చేందుకు ఆదాయం అవసరం. ఈకోణంలో చూస్తే భూము ల విలువల పెంపు ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చే చర్యగా చెప్పవచ్చు. అయితే ఈనిర్ణయం మరో వైపు సాధారణ ప్రజలపై ఆర్థిక భారం పెంచే అవకాశం కూడా ఉంది. కొత్తగా ఇల్లు కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలు, చిన్న స్థలాలు కొనుగోలు చేసే ఉద్యోగులు, రైతులు అధిక రిజిస్ట్రేషన్ ఖర్చులను భరించాల్సి వస్తుంది. భూమి ధరతో పాటు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెరగడంవల్ల మొత్తం కొనుగోలు వ్యయం అధికమ వుతుంది. ఇప్పటికే నిర్మాణ సామగ్రి ధరలు, బ్యాంకు రుణాల భారంతో ఇబ్బందిపడుతున్న గృహ కొనుగోలు దారులకు ఇది మరింత భారంగా మారే ప్రమాదం ఉంది.
రియల్ ఎస్టేట్రం గంపై కూడా ఈ నిర్ణయం మిశ్రమ ప్రభావం చూపుతుంది. కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడి దారులు ముందస్తు కొనుగోళ్లు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మరోవైపు అధిక రిజిస్ట్రేషన్ ఖర్చుల కారణంగా కొన్ని నెలల పాటు కొనుగోలు కార్యకలాపాలు మందగించే అవకాశం ఉంటుంది. అయితే దీర్ఘకాలంలో చూస్తే వాస్తవమార్కెట్ విలువలకు అనుగుణంగా ప్రభుత్వ విలువలు ఉండటంవల్ల భూ లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుంది. నల్లధనం వినియోగం తగ్గి, అధికారిక లావాదేవీలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకునే ఇటువంటి నిర్ణయాల్లో ప్రజల అభిప్రాయాలనుకూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం. ఒకే విధమైన పెంపు అన్నిప్రాంతాలకు సమానంగా వర్తిం పజేయడం కంటే, స్థానిక పరిస్థితులు, అభివృద్ధిస్థాయి, ప్రజల కొనుగోలు సామర్థ్యాన్ని దృష్టిలోఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. గ్రామీణప్రాంతాలు, అభివృద్ధి చెందుతున్న మండలాలు, వెనుకబడిన ప్రాంతాల్లో అధిక పెంపులు ప్రజ లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అందువల్ల శాస్త్రీయ అధ్యయనం, స్థానిక వాస్తవాల ఆధారంగా విలువలను నిర్ణ యించడం ఉత్తమమార్గం. వ్యవసాయ భూముల విలువలు పెరగడం రైతుల ఆస్తివిలువ పెరిగినట్లే కనిపించినప్పటికీ, వారసత్వ బదిలీలు, కుటుంబ విభజనలు, విక్రయాల సమ యంలో అదనపు ఖర్చులు రావచ్చు. రైతు ప్రయోజనాలను కాపాడేవిధంగా కొన్నిరాయితీలు లేదా ప్రత్యేక విధానాలుం డాలి. లేకపోతే భూమి యాజమాన్య మార్పిడి ప్రక్రియరైతు లకు భారంగా మారే ప్రమాదంఉంది. భూముల విలువల పెంపుఅనేది కేవలం ఆదాయ సేకరణ చర్యమాత్రమేకాదు. అది రాష్ట్ర ఆర్థికవ్యవస్థ, రియల్ ఎస్టేట్ రంగం, పట్టణాభి వృద్ధి, పెట్టుబడుల ప్రవాహం వంటి అనేక అంశాలకు సం బంధించింది. సరైన ప్రణాళికతో, సమతుల్య దృక్పథంతో అమలుచేస్తే ఇది ప్రభుత్వానికి ఆదాయం పెంచడంతో పాటు భూ లావాదేవీల్లో పారదర్శకతను తీసుకురాగలదు.
Uppala Girls Ashram School: ఉప్పల వెంకటేష్ సేవలు అభినందనీయం.. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Annamalai : అన్నామలై కొత్త ఒరవడిని సృష్టించగలరా?
Adulterated Ghee : భారీ కల్తీ నెయ్యి దందా .. అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్ల నెయ్యి స్వాధీనం!
Black Magic : ఢిల్లీలో ఘోరం: “చేతబడి” అనుమానంతో పనిమనిషిని చంపిన డాక్టర్
Gurdwara in Pakistan: పాకిస్థాన్ గురుద్వారాలో ఘోరం: సిక్కు సంరక్షక దంపతుల కాల్చివేత
EPF Balance Check: PF వడ్డీ జమ అయ్యిందా? ఇలా చెక్ చేయండి!